IND vs PAK : టీమ్ ఇండియాకు శుభారంభం.. పాక్‌ను మరోసారి చిత్తు చేసిన భారత్
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే మరో లీగ్, హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్ ఈ రోజు నుంచే మొదలైంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 86 పరుగుల భారీ స్కోరు చేసింది.

IND vs PAK : క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే మరో లీగ్, హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్ ఈ రోజు నుంచే మొదలైంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 86 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడటంతో, డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా భారత్ జట్టు 2 పరుగుల స్వల్ప తేడాతో పాకిస్తాన్‌ను మరోసారి ఓడించి శుభారంభం చేసింది.
హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైంది. మాంగ్ కాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. భారత జట్టును రాబిన్ ఉతప్ప, భరత్ చిప్లి ఓపెనింగ్ చేశారు. వీరు కేవలం మొదటి 2 ఓవర్లలోనే 34 పరుగులు చేసి ధనాధన్ ఆరంభం అందించారు.
రాబిన్ ఉతప్ప కేవలం 11 బంతుల్లో 28 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి మూడో ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన స్టూవర్ట్ బిన్నీ మొదటి బంతికే ఫోర్ కొట్టి, రెండో బంతికి అవుట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ 6 బంతుల్లో 17 పరుగులు జోడించడంతో, భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగుల భారీ స్కోరు సాధించింది.
87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పాకిస్తాన్ మొదటి ఓవర్‌లోనే 18 పరుగులు చేసింది. స్టూవర్ట్ బిన్నీ బౌలింగ్ చేసిన రెండో ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడి చేయగలిగారు. మూడో ఓవర్‌లో షాబాజ్ నదీమ్ 16 పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. సరిగ్గా అదే సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడింది.
వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా నిర్ణయించారు. ఈ పద్ధతి ద్వారా భారత్ జట్టు 2 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది తొలి విజయం. హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఒక్కొక్క గ్రూప్‌లో మూడు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్తాన్, కువైట్ గ్రూప్-సిలో ఉన్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లలో ఒక విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఒక విజయంతో రెండో స్థానంలో ఉంది. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
