AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Cricketers : కోట్లలో సంపాదిస్తున్న మహిళా క్రికెటర్లు.. ఈ 4 మార్గాల ద్వారా కాసుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 52 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత మహిళా జట్టు ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విజయం కారణంగా మహిళా క్రికెటర్ల వ్యాల్యూ, వారి ఆదాయం అమాంతం పెరిగాయి.

Women Cricketers : కోట్లలో సంపాదిస్తున్న మహిళా క్రికెటర్లు.. ఈ 4 మార్గాల ద్వారా కాసుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ
Women Cricketers
Rakesh
|

Updated on: Nov 07, 2025 | 4:16 PM

Share

Women Cricketers : నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 52 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత మహిళా జట్టు ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విజయం కారణంగా మహిళా క్రికెటర్ల వ్యాల్యూ, వారి ఆదాయం అమాంతం పెరిగాయి. గత మూడేళ్లుగా మహిళా క్రికెటర్ల ఆదాయం గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయమే. మహిళా క్రికెటర్లకు ఇప్పుడు నాలుగు ప్రధాన మార్గాల ద్వారా కోట్లలో డబ్బు ఎలా వస్తుందో తెలుసుకుందాం.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, యాన్యువల్ రిటైనర్ ఫీజు

భారత మహిళా క్రికెటర్ల ఆర్థిక స్థిరత్వానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రధాన ఆధారం. 2022లో బీసీసీఐ తీసుకున్న సమాన వేతనం అనే చారిత్రక నిర్ణయం తర్వాత వీరి ఆదాయం అమాంతం పెరిగింది. ఈ కాంట్రాక్ట్ నిర్మాణం ప్రకారం ప్లేయర్లను వారి ప్రదర్శన, అంతర్జాతీయ క్రికెట్‌లో భాగస్వామ్యం ఆధారంగా మూడు గ్రేడ్‌లుగా వర్గీకరిస్తారు. గ్రేడ్-ఏలో ఉన్న ఆటగాళ్లకు రూ.50 లక్షలు, గ్రేడ్-బీకి రూ.30 లక్షలు, గ్రేడ్-సీకి రూ.10 లక్షల చొప్పున వార్షిక రిటైనర్ ఫీజు లభిస్తుంది. ప్రస్తుతం వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి సీనియర్ ఆటగాళ్లు అత్యధిక రెమ్యునరేషన్ పొందే గ్రేడ్-ఏలో ఉన్నారు.

పురుష క్రికెటర్లకు సమానమైన మ్యాచ్ ఫీజు

యాన్యువల్ రిటైనర్ ఫీజుతో పాటు మహిళా క్రికెటర్లు ప్రతి మ్యాచ్‌కి పురుషుల జట్టుకు సమానంగా మ్యాచ్ ఫీజు అందుకుంటారు. టెస్టు క్రికెట్ ఆడటానికి రూ.15 లక్షలు, ప్రతి వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, ప్రతి అంతర్జాతీయ T20 మ్యాచ్ కి రూ.3 లక్షలు చెల్లిస్తారు. ప్లేయింగ్ ఎలెవన్ లో ఉన్న ప్రతి క్రీడాకారిణికి పూర్తి మ్యాచ్ ఫీజు లభిస్తుంది. జట్టులో ఉండి, ఆడే అవకాశం లభించని బ్యాచ్ ప్లేయర్లకు కూడా 50% మ్యాచ్ ఫీజును చెల్లించడం బీసీసీఐ పాలసీలోని ముఖ్య అంశం. ఈ సమాన వేతన నిర్మాణం దేశీయ క్రికెట్‌కు కూడా వర్తిస్తుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా వేలం ఆదాయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా ఫ్రాంచైజీ లీగ్‌లలో ఒకటిగా ఎదిగింది. ఇది మహిళా క్రికెటర్ల ఆదాయంలో గణనీయమైన వాటాను అందిస్తుంది. డబ్ల్యూపీఎల్ వేలంలో ఆటగాళ్లకు కనీస బేస్ ప్రైజ్ రూ.10 లక్షలుగా నిర్ణయించారు. అత్యధికంగా డిమాండ్ ఉన్న క్రీడాకారిణులకు కోట్లలో ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు, స్మృతి మంధాన అత్యధికంగా రూ.3.50 కోట్ల సాలరీని, రిచా ఘోష్ రూ.2.75 కోట్లు, హర్మన్‌ప్రీత్ కౌర్ రూ.2.5 కోట్ల వరకు ప్రతి సీజన్‌లో తమ ఫ్రాంచైజీల నుంచి పొందుతున్నారు. ఈ మొత్తం వారి వార్షిక రిటైనర్ కాంట్రాక్ట్‌కు అదనం.

ఎండార్స్‌మెంట్లు, నికర విలువ

జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై భారత మహిళా జట్టు సాధిస్తున్న విజయాల కారణంగా, క్రీడాకారిణుల మార్కెట్ వ్యాల్యూ కూడా పెరిగింది. ఇది వారికి కమర్షియల్ ఎండార్స్‌మెంట్ల రూపంలో భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి టాప్ క్రికెటర్లు బ్రాండ్‌లకు ప్రచారం చేస్తూ.. ఒక్కొక్కరు ప్రకటనల ద్వారా అదనంగా సుమారు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. ఈ ఎండార్స్‌మెంట్ ఫీజులు వారి మొత్తం నికర విలువను వేగంగా పెంచుతున్నాయి, తద్వారా వారు కేవలం క్రికెట్ ఆదాయంపైనే కాకుండా, తమ కమర్షియల్ ఇమేజ్‌పైనా ఆధారపడగలుగుతున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
Horoscope Today: వారికి మంచి ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం..
Horoscope Today: వారికి మంచి ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!