IND vs AUS: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆస్ట్రేలియాతో పోరుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్.. తొలిసారి కీలక నిర్ణయం?
Border - Gavaskar Trophy: 1996-97 నుంచి బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 16 సిరీస్‌లు ఆడాయి. అయితే, ఇందులో భారత జట్టు 10 సార్లు సిరీస్‌ను గెలుచుకోగా, ఆస్ట్రేలియా 5 సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. మరో సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ ఏడాది నవంబర్ నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Border – Gavaskar Trophy: అక్టోబరు-నవంబర్ మధ్యకాలంలో ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. విశేషమేమిటంటే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఏ 2 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబరు 31 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత్ ఏ, ఆస్ట్రేలియా ఏ జట్లు తలపడనుండగా.. 4 రోజుల పాటు 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. అలాగే ఈ మ్యాచ్‌ల తర్వాత ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియాలో టీమిండియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
ఇండియా A vs ఆస్ట్రేలియా A: మ్యాచ్ 1 (అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు)
ఇండియా A vs ఆస్ట్రేలియా A: మ్యాచ్ 2 (నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు)
ఇండియా vs ఇండియా A: ప్రాక్టీస్ మ్యాచ్ (నవంబర్ 15 నుంచి నవంబర్ 17 వరకు)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. గతంలో BGT సిరీస్‌లో 3 లేదా 4 మ్యాచ్‌లు నిర్వహించేవారు. భారత్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి.
సిరీస్‌లో మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరగనుండగా, రెండో మ్యాచ్‌కు అడిలైడ్ ఆతిథ్యం ఇవ్వనుంది. విశేషమేమిటంటే ఈ సిరీస్‌లో 2వ మ్యాచ్ డే నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌ని గులాబీ రంగు బంతితో ఆడనున్నారు.
మూడో మ్యాచ్‌కి గబ్బా మైదానం ఆతిథ్యం ఇవ్వనుండగా, నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరగనుంది. అంటే నాలుగో మ్యాచ్ బాక్సింగ్ టెస్టుగా పరిగణిస్తుంటారు. క్రిస్మస్ మరుసటి రోజు జరిగే మ్యాచ్‌ను బాక్సింగ్ టెస్ట్ అంటారు. చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 3, 2025 నుంచి సిడ్నీలో ప్రారంభమవుతుంది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
| మ్యాచ్ | తేదీ | స్థానం |
| మొదటి పరీక్ష | నవంబర్ 22 నుండి 26, 2024 వరకు | పెర్త్ స్టేడియం, పెర్త్ |
| రెండవ టెస్ట్ (పింక్ బాల్) | డిసెంబర్ 6 నుండి 10, 2024 వరకు | అడిలైడ్ ఓవల్ స్టేడియం, అడిలైడ్ |
| మూడో టెస్టు | డిసెంబర్ 14 నుండి 18, 2024 వరకు | గబ్బా స్టేడియం, బ్రిస్బేన్ |
| నాల్గవ టెస్ట్ (బాక్సింగ్ డే) | డిసెంబర్ 26 నుండి 30, 2024 వరకు | MCG స్టేడియం, మెల్బోర్న్ |
| ఐదవ పరీక్ష | జనవరి 3 నుండి 7, 2025 | సిడ్నీ క్రికెట్ స్టేడియం, సిడ్నీ |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




