AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: వేలంలో రూ. 7 కోట్లకుపైగా పట్టేశారు.. మైదానంలో అట్టర్ ఫ్లాప్.. టాప్ 3లో మనోడు..

3 Players Failed to Perform in IPL 2024: IPL 2024 ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024 కోసం తనపై రూ.24.75 కోట్లు పెట్టుబడి పెట్టిన కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

IPL 2024: వేలంలో రూ. 7 కోట్లకుపైగా పట్టేశారు.. మైదానంలో అట్టర్ ఫ్లాప్.. టాప్ 3లో మనోడు..
Ipl 2024 Maxwell
Venkata Chari
|

Updated on: May 28, 2024 | 2:00 PM

Share

3 Players Failed to Perform in IPL 2024: IPL 2024 ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024 కోసం తనపై రూ.24.75 కోట్లు పెట్టుబడి పెట్టిన కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఫైనల్‌లో స్టార్క్ 14 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అంతకుముందు క్వాలిఫయర్ 1లోనూ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

అయితే, ఐపీఎల్ 2024లో భారీ మొత్తంలో డబ్బు సంపాదించినా.. భారీగా ఫ్లాప్ అయిన కొందరు ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. వారెవరో ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2024 వేలంలో రూ. 7 కోట్లకు పైగా సంపాదించి, ఘోరంగా ఫ్లాప్ అయిన ముగ్గురు ఆటగాళ్లను చూద్దాం..

3. కుమార్ కుశాగ్రా..

ఐపీఎల్ 2024 కోసం నిర్వహించిన వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో కుమార్ కుషాగ్రా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆటగాడిని రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టులో చోటు చేర్చుకుంది. అతని ప్రదర్శన ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకోవడంలో కుశాగ్రా విజయం సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అతను నిరాశపరిచాడు. కుషాగ్రా 4 మ్యాచ్‌ల్లో 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

2. దేవదత్ పడిక్కల్..

IPL 2024కి ముందు, రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ దేవదత్ పడిక్కల్ (రూ. 7.75 కోట్లకు)ను తమ జట్టులో చేర్చుకుంది. సీజన్ ప్రారంభానికి ముందు పడిక్కల్ రాణిస్తుందని అనుకున్నా అది కుదరలేదు. టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో అతను ఫ్లాప్ అని నిరూపించుకున్నాడు. 38 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

1. గ్లెన్ మాక్స్‌వెల్..

ఐపీఎల్ 2024 వేలానికి ముందు గ్లెన్ మాక్స్‌వెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 11 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్ ల్లో 52 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో మ్యాక్స్‌వెల్ 4 సార్లు ఖాతా తెరవలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..