డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి.. టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.! అదే ఆఖరి సిరీస్.?
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. 2013 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. జట్టులో ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. చివరికి గ్రూప్ స్టేజిలోనే చతికిలపడుతూ వచ్చింది టీమిండియా. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ పరాజయం పాలవ్వడంతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో త్వరలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి భారత్ వెస్టిండీస్ పర్యటించనుంది. ఈ సిరీస్‌లో భాగంగా టీమిండియా 2 టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20లను ఆడనుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి తుది జట్టును బీసీసీఐ ప్రకటిస్తుంది. అయితే ఈలోపే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రోహిత్ శర్మను ఇప్పట్లో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగించేది లేదని.. వెస్టిండీస్ టూర్ తర్వాత దీనిపై చర్చిస్తామని అన్నారు.
అప్పటి పరిస్థితి బట్టి రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించాలా.? లేదా.? అనేది నిర్ణయించనున్నట్లు బీసీసీఐ అనధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు మాత్రం రోహిత్ శర్మే భారత్ జట్టు కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా రోహిత్ శర్మ విండీస్ టూర్‌లో ఆకట్టుకోలేకపోతే.. వన్డే, టీ20లకు కెప్టెన్‌గా హార్దిక్, టెస్ట్ కెప్టెన్‌గా రహనే అయ్యే అవకాశాలు లేకపోలేదు.