ఒక్క బంతికి 18 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఓవర్.. ఆ బౌలర్ మరెవరో కాదు.!

ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఐపీఎల్‌లో ఆడిన విజయ్ శంకర్, నటరాజన్, సాయి సుదర్శన్, షారూఖ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి కీలక ప్లేయర్స్..

ఒక్క బంతికి 18 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఓవర్.. ఆ బౌలర్ మరెవరో కాదు.!
Tnpl 2023
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 14, 2023 | 1:45 PM

ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఐపీఎల్‌లో ఆడిన విజయ్ శంకర్, నటరాజన్, సాయి సుదర్శన్, షారూఖ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి కీలక ప్లేయర్స్.. ఈ లీగ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం ఈ లీగ్‌లో భాగంగా సేలం స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన చెపాక్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. రంజన్ పాల్(88) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ నారాయణ్ జగదీశన్(35), సంజయ్ యాదవ్(31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు.

అయితే ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన సేలం కెప్టెన్ అభిషేక్ తన్వార్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఓవర్ వేశాడు. చెపాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 20 ఓవర్ వేసిన అతడు.. ఆ ఓవర్ ఆఖరి బంతికి ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా మూడు నో బాల్స్‌తో పాటు వైడ్ అలాగే ఆ నోబాల్స్‌లో 8 పరుగులతో పాటు చివరిగా వేసిన సరైన బంతికి 6 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఒక్క బంతికి 18 పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సేలం జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముహమ్మద్ అద్నాన్ ఖాన్(47), ఆకాశ్ సుమ్ర(24) రాణించారు. చెపాక్ బౌలర్లలో బాబా అపరజిత్, రాకీ భాస్కర్, విజు అరుల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.