AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వల్ల కూడా కాలేదు.. భారత్‌పై వరల్డ్ రికార్డు నమోదు చేసిన విండీస్

IND vs WI: గౌహతి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్ట్ ఇండీస్ సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో టీమిండియాపై అత్యంత వేగంగా 200 పరుగులు సాధించిన మూడో జట్టుగా విండీస్ నిలిచింది. కేవలం 25.3 ఓవర్లలోనే ఈ మైలురాయిని అందుకోవడంలో జాన్ కాంప్‌బెల్, షై హోప్ కీలక పాత్ర పోషించారు.

IND vs WI: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వల్ల కూడా కాలేదు.. భారత్‌పై వరల్డ్ రికార్డు నమోదు చేసిన విండీస్
West Indies
Rakesh
|

Updated on: Sep 30, 2026 | 5:20 PM

Share

IND vs WI: భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కరేబియన్ జట్టు అద్భుత రికార్డు నమోదు చేసింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ ఇండీస్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ విధ్వంసకర సెంచరీ, కెప్టెన్ షై హోప్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో వెస్ట్ ఇండీస్ కేవలం 25.3 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్‌పై అతి తక్కువ ఓవర్లలో 200 పరుగులు సాధించిన మూడో జట్టుగా వెస్ట్ ఇండీస్ నిలిచింది.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు సాధ్యం కాని ఘనత

వన్డేల్లో టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొని ఈ స్థాయిలో వేగంగా 200 పరుగులు చేయడం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి దిగ్గజ జట్లకు కూడా సాధ్యపడలేదు. భారత్‌పై అత్యంత వేగంగా 200 పరుగులు సాధించిన రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. 1997లో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 25.1 ఓవర్లలోనే 200 పరుగులు సాధించింది. 2018లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 25.2 ఓవర్లలో ఈ మైలురాయిని దాటి రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ 25.3 ఓవర్లలో 200 పరుగులు చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. 2009 రాజ్‌కోట్ వన్డేలో 25.5 ఓవర్లలో 200 పరుగులు చేసిన శ్రీలంక ప్రస్తుతం నాలుగో స్థానానికి పరిమితమైంది.

వన్డేల్లో భారత్‌‌పై అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన టాప్-4 జట్లు

పాకిస్తాన్: 25.1 ఓవర్లు (లాహోర్, 1997)

సౌతాఫ్రికా: 25.2 ఓవర్లు (జోహన్నెస్‌బర్గ్, 2018)

వెస్ట్ ఇండీస్: 25.3 ఓవర్లు (గువాహటి, 2026)*

శ్రీలంక: 25.5 ఓవర్లు (రాజ్‌కోట్, 2009)

భారత గడ్డపై సాధించిన తొలి జట్టుగా రికార్డు

ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తమ సొంత గడ్డపై భారత బౌలర్లను ఎదుర్కొని ఈ ఘనత సాధించాయి. కానీ, వెస్ట్ ఇండీస్ జట్టు ఏకంగా భారత గడ్డపై, భారత బౌలర్ల ముందే ఈ సంచలన ప్రదర్శన చేయడం గమనార్హం. జాన్ కాంప్‌బెల్ 65 బంతుల్లోనే సెంచరీ బాది కరేబియన్స్ తరఫున ఐదో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ పూర్తి చేసుకోగా, షై హోప్, అమీర్ జాంగూలు కూడా సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ ధాటితో వెస్టిండీస్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లి భారత బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us