IND vs SL: టెస్టులు, వన్డేల్లో చించేశాడు.. టీ20ల్లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు.. ఆ టీమిండియా యువ ప్లేయర్ ఎవరంటే?
India vs Sri Lanka: మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓ యువ ప్లేయర్ అరంగేట్రం ఛాన్స్ ఉంది.

Shubman Gill: కొత్త ఏడాది ప్రారంభంలోనే భారత జట్టు తొలి సిరీస్ శ్రీలంకతో మంగళవారం నుంచి ఆడేందుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో రోహిత్, విరాట్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వగా, జట్టులోని పలువురు యువ ఆటగాళ్లు రంగంలోకి దిగనున్నారు. హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు కెప్టెన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్లేయింగ్ XI లో కూడా కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. తాజా వార్తల ప్రకారం, శ్రీలంకతో జరిగే తొలి టీ20లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే శుభ్‌మన్ గిల్‌కి ఇది తొలి టీ20 కానుంది.
గతేడాది వన్డేల్లో అదరగొట్టిన గిల్..
గత సంవత్సరం వన్డే ఫార్మాట్‌లో శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా రాణించాడు. దాంతో గిల్‌కు ప్రయోజనం చేకూరిందని భావిస్తున్నారు. టీ20 జట్టులో రాహుల్ త్రిపాఠి, రితురాజ్ గైక్వాడ్ వంటి ఓపెనర్లు ఉన్నప్పటికీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాల ప్రకారం, గిల్‌కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది.
శుభ్‌మన్ గిల్‌కి ఎందుకు అవకాశం వచ్చింది?
శుభ్‌మన్ గిల్‌కి ఎందుకు అవకాశం రానుందనే ఈ ప్రశ్న కూడా ముఖ్యమైనదే. ఎందుకంటే గత కొన్ని సిరీస్‌లకు టీ20 జట్టులోకి వచ్చినా అరంగేట్రం చేసే అవకాశం రాని రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాడు కూడా ఉన్నాడు. గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో రాహుల్ త్రిపాఠి కంటే గిల్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనుందని తెలుస్తోంది. గతేడాది గిల్ ODI ఫార్మాట్‌లో వేగంగా పరుగులు చేశాడు. అతను అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. దీన్ని టీమ్ మేనేజ్‌మెంట్ సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.




గిల్ వన్డే కెరీర్..
శుభ్‌మన్ గిల్ 2022లో 12 వన్డేల్లో 638 పరుగులు చేశాడు. గిల్ బ్యాటింగ్ సగటు 70.88గా నిలిచింది. అతని స్ట్రైక్ రేట్ కూడా 100 దాటింది. గిల్ బ్యాట్ నుంచి ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు వచ్చాయి.
గిల్ టీ20 రికార్డులు..
శుభ్‌మన్ గిల్ 92 టీ20 మ్యాచ్‌ల్లో 33.46 సగటుతో 2577 పరుగులు చేశాడు. గిల్ స్ట్రైక్ రేట్ 128 కంటే ఎక్కువగా ఉంది. అతని స్ట్రైక్ ఖచ్చితంగా తక్కువే. కానీ, ఈ ఆటగాడికి నిరంతరం పరుగులు చేసే శక్తి ఉంది. గిల్ బ్యాట్‌లో ఒక సెంచరీ, 17 హాఫ్ సెంచరీలు వచ్చాయి.
శ్రీలంకతో తలపడే భారత జట్టు..
హార్దిక్ పాండ్యా , సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రీతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
