IND vs SL: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. వన్డే సిరీస్ ప్రారంభానికి లైన్ క్లియర్!

శ్రీలంక జట్టులోని ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. భారత్‌తో వన్డే సిరీస్ ఆలస్యం అయింది. జులై 13 నుంచి మొదలుకావాల్సిన వన్డే సిరీస్... జులై 18 నుంచి మొదలు కానుంది.

IND vs SL:  గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. వన్డే సిరీస్ ప్రారంభానికి లైన్ క్లియర్!
Sri Lanka Cricket Team
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 11, 2021 | 6:45 PM

IND vs SL: టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంహించేందుకు మార్గం సుగుమమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు నేడు శ్రీలంక టీం నుంచి గుడ్ న్యూస్ వెల్లడైంది. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన శ్రీలంక టీంలోని ప్రధాన ఆటగాళ్లందరికి నేడు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్‌గా వచ్చిందంట. అలాగే సీనియర్ ఆటగాళ్లు కుసాల్ పెరీరా, దుష్మంత్ చమీరా, ధనుంజయ్ డిసిల్వా లకు కూడా నెగిటివ్ వచ్చిందంట. ఈ పరీక్షలను శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) నిర్వహించింది. బ్రిటన్ నుంచి వచ్చిన వీరంతా ఒక వారం కఠినమైన క్వారంటైన్‌ను పూర్తిచేశారని, సోమవారం నుంచి  బయో బబుల్‌లోకి ప్రవేశిస్తారని శ్రీలంక బోర్డు తెలిపింది. జులై 13 నుంచి ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్.. జులై 18 నుంచి మొదలుకానుంది. అయితే, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేలా అనలిస్ట్ జీటీ నిరోషన్‌ కోవిడ్ టెస్టు చేసిన తరువాత టీంతో జాయిన్ అవుతారని తెలిపింది.

ఈమేరక ఎస్‌ఎల్‌సీ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ, సానుకూల ఫలితాలు వచ్చిన వెంటనే మేము ప్రకటింస్తాం. నిన్న మరో రౌండ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాం. ఫలితాలు ఈ రోజు రానున్నాయి. సానుకూలంగా ఫలితాలు వచ్చిన వెంటనే మేము అధికారికంగా వెల్లడిస్తాం. ఆటగాళ్లంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని, సోమవారం నుంచి బయో బబుల్‌లోకి ఎంటరవుతారని తెలిపారు. సవరించిన షెడ్యూల్ మేరకు… టీమిండియా సింహాళ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్‌సీ) మైదానంలో శిక్షణ పొందుతున్నారని, అలాగే శ్రీలంక క్రీడాకారులు ఆర్ ప్రేమదాస స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తుందని తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే సోమవారం నాడు ఆటగాళ్లు బయో బబుల్‌లోకి ఎంటరవుతారు. నిబంధనల మేరకు కరోనా టెస్టులు ప్రతీ మూడు రోజులు లేదా ఐదు రోజులకోసారి చేయనున్నామని పేర్కొన్నారు.

బయో బబుల్‌లోకి ప్రవేశించిన తరువాత ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకోవచ్చు. ఆటగాళ్ల కోసం అదనంగా జిమ్ ఏర్పాటు చేశామని, 48 గంటల్లో ట్రైనింగ్, నెట్ ప్రాక్టీస్ మొదలవ్వనున్నాయని భావిస్తున్నట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు జులై 18 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన పేర్కొన్నారు.

Also Read:

హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్‌ వెనుక అసలు కారణం ఇదేనంట..! వెల్లడించిన కోచ్ పవన్ సేన్

టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ఓపెనింగ్ చేసేది వీరేనంట: ప్రకటించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హగ్!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ