AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: గంగూలీ పరాభవానికి.. 23 ఏళ్ల తర్వాత రోహిత్ ప్రతీకారం.. వడ్డీతో తిరిగిచ్చేసిన భారత్..

India vs Sri Lanka, Final: 2000 సంవత్సరం నాటి అవమానానికి ఇప్పుడు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా ఫైనల్ మ్యాచ్ లోనే కావడం ఇక్కడ విశేషం. ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌటైంది. 23 ఏళ్ల క్రితం ఘోర పరాభవం చూపిన అదే జట్టుపై ఘన విజయాన్ని సాధించింది.

IND vs SL: గంగూలీ పరాభవానికి.. 23 ఏళ్ల తర్వాత రోహిత్ ప్రతీకారం.. వడ్డీతో తిరిగిచ్చేసిన భారత్..
Ind Vs Sl Asia Cup 2023 Final
Venkata Chari
|

Updated on: Sep 17, 2023 | 6:50 PM

Share

India vs Sri Lanka, Final: అక్టోబర్ 29, 2000.. షార్జాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, శ్రీలంక జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సనత్ జయసూర్య నేతృత్వంలోని శ్రీలంక జట్టు 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

300 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా కేవలం 26.3 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది. వన్డే క్రికెట్‌లో భారత జట్టు చెత్త ప్రదర్శన ఇదే. మరో మాటలో చెప్పాలంటే, 1981లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 63 పరుగులకే ఆలౌటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌట్ కాలేదు. కానీ, శ్రీలంక జట్టు కేవలం 54 పరుగులకే ఆలౌట్ చేసింది.

ఈ అవమానానికి ఇప్పుడు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా ఫైనల్ మ్యాచ్ లోనే కావడం ఇక్కడ విశేషం. ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌటైంది. 23 ఏళ్ల క్రితం ఘోర పరాభవం చూపిన అదే జట్టుపై ఘన విజయాన్ని సాధించింది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకించి వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియాపై శ్రీలంక చేసిన అత్యల్ప స్కోరు ఇదే కాడం గమనార్హం. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. దీంతో పాటు 23 ఏళ్ల క్రితం టీమిండియాను అతి తక్కువ మొత్తానికి మట్టికరిపించి చరిత్ర సృష్టించిన లంకపై భారత జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది.

2000లో శ్రీలంకతో ఆడిన టీమ్ ఇండియా: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వినోద్ కాంబ్లీ, హేమంగ్ బదానీ, రాబిన్ సింగ్, విజయ్ దహియా, సునీల్ జోషి, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, వెంకటేష్ ప్రసాద్.

2023లో కొత్త చరిత్ర రాస్తున్న టీమ్ ఇండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిమ్‌రాజ్, వాషింగ్టన్ సుందర్.

చమిందా వాస్ మ్యాజిక్..

2000లో భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో శ్రీలంక తరపున చమిందా వాస్ 9.3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఈసారి శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ 7 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి రాణించాడు.

టీమ్ ఇండియా ఆసియా ఛాంపియన్స్..

ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు భారత పేసర్ల ధాటికి తడబడింది. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే భారత జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత 4వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. దీని తర్వాత సిరాజ్ మరో రెండు వికెట్లు తీసి 6 వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. దీంతో శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది.

51 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లు శుభారంభం అందించారు. తొలి 4 ఓవర్లలో 34 పరుగులు చేసిన తర్వాత వీరిద్దరూ జట్టుకు విజయాన్ని అందించడానికి పవర్‌ప్లే ప్రారంభించారు. చివరకు 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 8వ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెజాన్ నదిపై వంతెనలు లేవని తెలుసా?
అమెజాన్ నదిపై వంతెనలు లేవని తెలుసా?
అమ్మో.. ఆవిడ ఆత్మలతో మాట్లాడుతుందట! బాల్యం నుంచి దెయ్యాలతో స్నేహం
అమ్మో.. ఆవిడ ఆత్మలతో మాట్లాడుతుందట! బాల్యం నుంచి దెయ్యాలతో స్నేహం
చెత్త సలహాలు వద్దు..ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్‌పై కోచ్ గంభీర్ ఫైర్
చెత్త సలహాలు వద్దు..ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్‌పై కోచ్ గంభీర్ ఫైర్
చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..