IND vs SA: ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. సిరీస్‌లో భాగంగా జూన్ 9 నుంచి 19 వరకు ఇరు జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగాజరిగే పొట్టి ప్రపంచకప్ ఉండడంతో ఈ సిరీస్‌ను సన్నాహకంగా వినియోగించాలని టీమిండియా భావిస్తోంది. ఐపీఎల్ టోర్నీ ముగిసే లోపే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. కాగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీకి సౌతాఫ్రికా సిరీస్ (IND vs SA) లో విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉన్నాయి. మోచేతి కండరం గాయంతో బాధపడుతున్న ఈ స్టార్ ఆటగాడు ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతనికి నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరం అని తేలింది. దీంతో సఫారీలతో టీ 20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.
కాగా గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన సూర్యకుమార్ ఆ తర్వాత కోలుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున మొత్తం 8 మ్యాచ్‌ల్లో 309 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. గాయంతో టోర్నీలోనే మధ్యలోనే వైదొలగిన సూర్య రిహాబిలిటేషన్లో భాగంగా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా ఉంది.
* తొలి టీ20 : జూన్ 9 (ఢిల్లీ)
* రెండో టీ20 : జూన్ 12 (కటక్)
* మూడో టీ20 : జూన్ 14 (వైజాగ్)
*నాలుగో టీ20 : జూన్ 17 (రాజ్‌కోట్)
* ఐదో టీ20 : జూన్ 19 (బెంగళూరు)
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: