IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పులు.. టెస్ట్ సిరీస్ మొదలయ్యేది అప్పుడే.. ఇక ఐదు రోజులు జరగనున్న మహిళల టెస్ట్ మ్యాచులు: బీసీసీఐ
3 టెస్టులు, 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. దీనిపై నేడు కోల్‌కతాలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో..
India Tour Of South Africa: దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ ముప్పు ఉన్నప్పటికీ, భారత క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే సిరీస్‌ల కోసం ఈ నెలలో పర్యటించనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి, అన్ని భయాలు, ఊహాగానాలను విస్మరించి, ఈ పర్యటన కోసం భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరుతుందని డిసెంబర్ 4 శనివారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్ షెడ్యూల్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. గతంలో డిసెంబర్ 17 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు 9 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ ‘బాక్సింగ్ డే టెస్ట్’తో ప్రారంభమై ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వచ్చే ఏడాది కొత్త షెడ్యూల్‌తో ఆడాలని రెండు బోర్డులు కలిసి నిర్ణయించాయి.
భారత జట్టు తన నిబద్ధతతో దక్షిణాఫ్రికా పర్యటనను కొనసాగిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జే షా శనివారం ధృవీకరించారు. అయితే ఈ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడబోమని షా చెప్పాడు. టెస్టు, వన్డే సిరీస్‌లు మాత్రమే జరుగుతాయని, టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత సిద్ధం చేస్తామని ప్రకటించారు. క్రికెట్ సౌతాఫ్రికా కూడా భారత జట్టు పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉంటుందని ప్రకటించింది. అయితే తరువాత దానిని కొన్ని రోజులు వాయిదా వేయాలని, కొత్త తేదీలలో ప్రారంభించాలని నిర్ణయించారు.
శనివారం కోల్‌కతాలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై చర్చించగా, అంతకుముందు షెడ్యూల్‌లో కొన్ని మార్పుల చేశారు. డిసెంబర్ 17కి బదులుగా డిసెంబర్ 26 నుంచి పర్యటనను ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబరు 8న భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు విరాట్ కోహ్లి అండ్ కోకు కొన్ని రోజుల విశ్రాంతి లభించనుంది. ఈ టూర్‌కి సంబంధించి టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌ల తేదీలు మారడంతో కొత్త షెడ్యూల్ కూడా త్వరలో విడుదల కానుంది.