IND vs NZ: 32 ఏళ్ల చెత్త రికార్డును సొంతం చేసుకున్న కివీస్.. ముంబై టెస్టులో భారత బౌలర్ల ధాటికి అత్యల్ప స్కోర్‌‌కే ఆలౌట్..!

India Vs New Zealand, 2nd Test: భారత్‌లో అత్యల్ప టెస్టు స్కోరు సాధించిన రికార్డు ప్రస్తుతం న్యూజిలాండ్ పేరిట చేరింది. ముంబై టెస్టులో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించింది.

IND vs NZ: 32 ఏళ్ల చెత్త రికార్డును సొంతం చేసుకున్న కివీస్.. ముంబై టెస్టులో భారత బౌలర్ల ధాటికి అత్యల్ప స్కోర్‌‌కే ఆలౌట్..!
Follow us

|

Updated on: Dec 04, 2021 | 4:16 PM

India Vs New Zealand, 2nd Test: ముంబై వాంఖడే మైదానంలో (India Vs New Zealand, 2nd Test) భారత బౌలర్లు విధ్వంసం సృష్టించడంతో ప్రపంచ నంబర్ 1 టెస్టు జట్టు న్యూజిలాండ్ ఉలిక్కిపడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌లో అత్యల్ప టెస్ట్ స్కోరు రికార్డు న్యూజిలాండ్ పేరిట నిలిచింది. 1987లో ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్‌పై భారత జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది భారత గడ్డపై అత్యల్ప టెస్టు స్కోరు.

ముంబైలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ టాప్ 3 బ్యాట్స్‌మెన్‌లకు మహమ్మద్ సిరాజ్ చుక్కలు చూపించాడు. సిరాజ్ బౌలింగ్‌లో టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్‌ల కీలక వికెట్లు తీశాడు. దీని తర్వాత స్పిన్ త్రయం ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్ మిగతా పనిని పూర్తిచేశారు. బౌలింగ్‌లో అశ్విన్‌ కేవలం 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

షాకైన లాథమ్-యంగ్.. కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విల్ యంగ్, టామ్ లాథమ్ జోడీ ముంబైలో ఒక్క‎ పరుగు కూడా చేయలేదు. నాలుగో ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన వేగవంతమైన బంతికి విల్ యంగ్ కోహ్లి చేతికి చిక్కాడు. విల్ యంగ్ 4 పరుగులు చేశాడు. సిరాజ్ వేసిన అదే ఓవర్ చివరి బంతికి లాథమ్ కూడా శ్రేయాస్ అయ్యర్ చేతికి చిక్కాడు.

దీని తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ రెండు బంతుల తర్వాత అతని ఆట ముగిసింది. సిరాజ్ అత్యుత్తమ బంతికి టేలర్‌ను బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్‌కు బంతిని అందించగా, ఈ స్పిన్నర్ డారెల్ మిచెల్‌ను కేవలం 8 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీని తర్వాత హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్రలను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. న్యూజిలాండ్ 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 20వ ఓవర్‌లో టామ్ బ్లండెల్, టిమ్ సౌథీలను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ న్యూజిలాండ్ ఆశలన్నింటినీ దెబ్బ తీశాడు. కైల్ జేమ్సన్ 17 పరుగులు చేశాడు. కానీ, 28వ ఓవర్‌లో అతని భాగస్వామి విలియం సోమర్‌విల్లే, జేమ్సన్ పెవిలియన్ చేరారు. ఫలితంగా భారత్‌పై న్యూజిలాండ్ అత్యల్ప టెస్ట్ స్కోరు సాధించింది. ఏ ఆసియా జట్టుపైనా ఇది వారి అత్యల్ప టెస్ట్ స్కోరు గా నిలిచింది.

న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ ‌పటేల్‌ టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. ముంబై టెస్ట్‌లో తన స్పిన్‌ మాయాజాలంతో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. ముంబైలో పుట్టిన ఎజాజ్‌ పటేల్‌ తరువాత న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడింది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ జిమ్‌ లేకర్‌ , అనిల్‌ కుంబ్లేల రికార్డును సమం చేశాడు ఎజాజ్‌ పటేల్‌. ఎజాజ్‌ స్పిన్‌ మాయాజాలానికి టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో ఎజాజ్‌ పటేల్‌ సత్తా చాటాడు. వాంఖేడ్‌ గ్రౌండ్‌లో టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు అలౌట్‌ చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లలో మూడో ఆటగాడిగా నిలిచాడు. అనిల్‌కుంబ్లే తర్వాత ఈ రికార్డు సాధించిన బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇంగ్లాండుకు చెందిన జిమ్‌లేకర్, 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్లు తీశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా జిమ్ లేకర్ రికార్డు సృష్టించాడు. 1956లో యాషెస్ సిరీస్‌లో ఈ రికార్డును సాధించాడు.

భారత్‌కు చెందిన ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అనిల్ కుంబ్లే. 1999లో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ఢిల్లీలో పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు కుంబ్లే.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.