IND vs SA: కటక్‌లో ఖంగుతిన్న టీమిండియా బ్యాటర్లు.. సౌతాఫ్రికా ముందు ఈజీ టార్గెట్‌..

|

Jun 12, 2022 | 9:15 PM

India vs South Africa 2nd T20: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌలర్ల ముందు నిలవలేకపోయారు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌ నిరాశపర్చడంతో

IND vs SA: కటక్‌లో ఖంగుతిన్న టీమిండియా బ్యాటర్లు.. సౌతాఫ్రికా ముందు ఈజీ టార్గెట్‌..
Ind Vs Sa
Follow us on

India vs South Africa 2nd T20: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌలర్ల ముందు నిలవలేకపోయారు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌ నిరాశపర్చడంతో కటక్‌ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయస్‌ అయ్యర్ (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (34; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్ (30, 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారు అలావచ్చి ఇలా వెళ్లిపోయారు.
కాగా ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) మరోసారి నిరాశపర్చాడు. గత మ్యాచ్‌లో రాణించిన రిషభ్‌ పంత్‌ (5), హార్దిక్‌ పాండ్య (9) కూడా తక్కువ స్లోర్లకే పెవిలియన్‌ చేరుకున్నారు.

భారత్‌ బ్యాటింగ్‌ ముగిసింది. శ్రేయస్‌ అయ్యర్ (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (34; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) మరోసారి నిరాశపర్చాడు. ఇషాన్‌, శ్రేయస్‌లు కొన్ని మెరుపులు మెరిపించినా.. కిషాన్‌ ఔటైన తర్వాత స్కోరు వేగం మందగించింది. గత మ్యాచ్‌లో మెరిసిన రిషభ్‌ పంత్‌ (5), హార్దిక్‌ పాండ్య (9) విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ 10 పరుగులు చేశాడు. చివర్లో దినేశ్‌ కార్తీక్ , హర్షల్ పటేల్‌ (12 నాటౌట్‌) కొన్ని మెరుపులు మెరిపించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆన్రిచ్‌ నార్జ్‌ (36/2) రెండు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ, పార్నెల్‌, ప్రిటోరియస్, కేశవ్‌ మహరాజ్‌ తలా ఓ వికెట్‌ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Maoists Surrender: ఏవోబీలో మావోలకు భారీ ఎదురుదెబ్బ.. 180 మంది సానుభూతిపరుగుల లొంగుబాటు.. పోలీసుల ఎదుటే యూనిఫాం దగ్ధం..

CM KCR: ఉండవల్లితో సమావేశమైన గులాబీ బాస్‌.. జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సరికొత్త చర్చకు దారి తీసిన భేటీ..

Viral Video: ఈ ఎలుగుబంటికి ట్రాఫిక్‌ సెన్స్‌ ఎక్కువే.. రోడ్డుపై ట్రాఫిక్‌ కోన్‌ను ఎలా సరి చేసిందో మీరే చూడండి..