IND vs SA: సఫారీలతో టెస్ట్ సిరీస్.. గాయంతో రుతురాజ్ ఔట్.. టీమ్‌లోకి యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ప్లేయర్
విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అలాగే సఫారీలతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా దూరమయ్యాడు . దక్షిణాఫ్రికాతో జరిగిన 2వ వన్డేలో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి అతని కుడి వేలికి గాయమైంది.
డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నేపథ్యంలో ఈ సిరీస్‌లో విజయం సాధించడం టీమిండియాకు చాలా అవసరం. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అలాగే సఫారీలతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా దూరమయ్యాడు . దక్షిణాఫ్రికాతో జరిగిన 2వ వన్డేలో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి అతని కుడి వేలికి గాయమైంది. ఈ గాయం నుంచి రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. రుతు రాజ్ స్థానంలో పశ్చిమ బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌కు స్థానం కల్పించారు. ప్రస్తుతం ఇండియా ఎ జట్టులో ఉన్న అభిమన్యు దక్షిణాఫ్రికాలో ఉండటంతో రుతురాజ్‌కు బదులుగా బీసీసీఐ అతనినే జట్టులోకి ఎంపిక చేసింది. భారత్ వార్మప్ మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఎ తరఫున ఆడిన ఈశ్వరన్ 2వ రోజు అజేయంగా 61 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన ఫలితంగా ఇప్పుడు బెంగాల్ బ్యాటర్‌కు భారత జట్టులోకి వచ్చేశాడు.
కాగా అభిమన్యు ఈశ్వరన్ ఇంతకుముందు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం వచ్చింది. మరి ఈసారి అతనిని అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.
ట్యాలెంటెడ్ ఓపెనర్:
అభిమన్యు ఈశ్వరన్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఓపెనర్. అతను 2013లో బెంగాల్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 47.24 సగటుతో 6,000 పైగా పరుగులు చేశాడు ఈశ్వరన్. ఈ మంచి ప్రదర్శన ఫలితంగా ఇప్పుడు అభిమన్యుకి మళ్లీ టీమిండియాలో అవకాశం దక్కింది.
భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ కుమార్, ముఖేష్ కుమార్ బుమ్రా (వైస్ కెప్టెన్), పర్దీష్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్.
భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
డిసెంబర్ 26 నుండి – మొదటి టెస్ట్ (సెంచూరియన్) జనవరి 3 నుండి – రెండవ టెస్ట్ (కేప్ టౌన్)
Ruturaj Gaikwad ruled out of the Test series vs South Africa.
– Abhimanyu Easwaran named as the replacement for Ruturaj. pic.twitter.com/2xYVj9v2wZ
— Johns. (@CricCrazyJohns) December 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..