AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత్‌ను కలవరపెడుతోన్న ‘ఆ’ పీడకల.. గత చరిత్ర తిరగరాసేనా..?

Team India: ఆసియా కప్‌ 2025 (Asia Cup 2025)లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, పాక్ జట్ల మధ్య రేపు ఈ మెగా మ్యాచ్ జరగనుంది. పాక్ జట్టుతో పోల్చితే భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకుంది. కాగా, మూడోసారి పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే, భారత జట్టును కలవరపెడుతోన్న ఓ అంశం ఒకటుంది. మరి ఈసారి ‘చరిత్ర’ను సూర్యసేన మార్చుతుందా లేదా అనేది చూడాలి.

IND vs PAK: భారత్‌ను కలవరపెడుతోన్న 'ఆ' పీడకల.. గత చరిత్ర తిరగరాసేనా..?
Ind Vs Pak Final
Venkata Chari
|

Updated on: Sep 27, 2025 | 4:37 PM

Share

క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్, కేవలం ఒక మ్యాచ్ కాదు; ఇది నాలుగు దశాబ్దాల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా దాయాదులు టైటిల్ కోసం తలపడటం. ఇది కేవలం కప్పు కోసం పోరాటం కాదు, క్రికెట్ అభిమానుల భావోద్వేగాలు, పాత లెక్కలు తేల్చుకోవడానికి భారత జట్టుకు దొరికిన అద్భుత అవకాశం..!

ఛాంపియన్స్ ట్రోఫీ పీడకల (UAE Nightmare)

భారత అభిమానుల మనసులో ఇప్పటికీ పీడకలలా మిగిలి ఉన్న ఒక చేదు జ్ఞాపకం ఉంది. అది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఆ రోజు పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. యూఏఈ గడ్డపై (ముఖ్యంగా దుబాయ్‌లో) పాకిస్తాన్‌కు ఉన్న ట్రాక్ రికార్డు, గతంలో చూపిన మెరుపు ప్రదర్శనలు భారత అభిమానులను తరచుగా కలవరపెడుతూ ఉంటాయి. గత టోర్నీలో భారత్ రెండుసార్లు పాకిస్తాన్‌ను ఓడించినప్పటికీ, ఫైనల్‌లో పాక్ మళ్లీ అదే జోరు చూపిస్తే ఏమవుతుందోనని క్రికెట్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

భారత్ ఆధిపత్యం: తిరుగులేని ఫామ్..!

ఈ ఆసియా కప్ 2025‌లో టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా, అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో, సూపర్-4 దశలో పాకిస్తాన్‌ను రెండుసార్లు చిత్తు చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు, సూర్యకుమార్ యాదవ్ స్థిరత్వం, కుల్దీప్ యాదవ్ మాయాజాలం బౌలింగ్‌లో టీమిండియాకు బలాన్నిచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఈ ఫైనల్‌లోనూ భారత జట్టు ఫేవరెట్‌‌గా బరిలోకి దిగనుంది. అయితే, యూఏఈలో మ్యాచ్ ఫలితాలు మాత్రం సూర్యసేనకు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యంగా పాక్ జట్టుతో జరిగిన యూఏఈ గడ్డపై ఆడిన ఐసీసీ టోర్నీ ఫైనల్స్ పెద్దగా అచ్చి రాలేదు. మొత్తంగా ఇరు జట్లు 10 ఫైనల్స్‌ ఆడగా, భారత జట్టు కేవలం 3 సార్లే విజయం సాధించిందన్నమాట.

కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత, మరో ప్రధాన టోర్నమెంట్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కోవడం భారత ఆటగాళ్లకు ఒక పెద్ద సవాల్. ఈసారి ఆ “యూఏఈ నైట్‌మేర్”ను పూర్తిగా తుడిచిపెట్టేసి, చరిత్రను తమవైపు తిప్పుకోవాలనే కసితో టీమిండియా ఉంది.

పాక్ కసి: ప్రతీకారం తీర్చుకునేందుకు!

మరోవైపు పాకిస్తాన్ ఈసారి కప్పును గెలిచి తమ గౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. ఫైనల్‌కు చేరుకోవడానికి చివరి నిమిషంలో వారు చూపిన పోరాటస్ఫూర్తి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ వంటి అగ్రశ్రేణి పేసర్లు ఒకేసారి ఫామ్‌లోకి వస్తే, భారత బ్యాటింగ్‌కు పరీక్ష తప్పదు. ముఖ్యంగా, గ్రూప్ స్టేజ్‌లో, సూపర్-4లో భారత్ చేతిలో ఎదురైన రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

చరిత్ర మారుతుందా?

41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్-పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోవడం ఒక చారిత్రక ఘట్టం. గతం గతం. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు బాగా ఆడితే, అదే చరిత్రను తిరగరాస్తుంది. యూఏఈ మైదానంలో పాత చేదు అనుభవాన్ని మర్చిపోయి, టీమిండియా కప్పును ముద్దాడి, ఛాంపియన్స్ ట్రోఫీ పీడకలను పూర్తిగా తుడిచిపెడుతుందా? లేదా పాకిస్తాన్ మళ్లీ అద్భుతం సృష్టించి, ట్రోఫీని ఎగరేసుకుపోతుందా?

సరిహద్దుల్లో సైనికులు ఎంత ఉద్వేగంతో ఉంటారో, క్రికెట్ అభిమానులు అంతకంటే ఎక్కువ ఉద్వేగంతో ఎదురుచూస్తున్న ఈ మహా సంగ్రామం భారత క్రికెట్ చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం..! ఆదివారం దుబాయ్ లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే జరగదు, కోట్ల మంది అభిమానుల కలలు, ఆశలు ఆ బంతి-బ్యాట్‌తో ముడిపడి ఉన్నాయి. ఎవరు గెలిచినా, చరిత్ర మాత్రం మారుతుంది..!

యూఏఈ బయట జరిగిన భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్..

2007 టీ20 ప్రపంచ కప్‌ – భారత్

1998లో ఇండిపెండెన్స్‌ కప్‌ ఫైనల్‌ – భారత్

1985లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్ ఆఫ్‌ క్రికెట్ టోర్నీ ఫైనల్‌ – భారత్

7సార్లు భారత్‌కు చుక్కెదురే..

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ – పాకిస్తాన్

2008లో ముక్కోణపు సిరీస్‌ – పాకిస్తాన్

1999లో పెప్సీ కప్‌ – పాకిస్తాన్

1999లో కోకకోలా కప్‌ – పాకిస్తాన్

1994లో ఆస్ట్రల్ కప్ – పాకిస్తాన్

1991లో విల్స్‌ ట్రోఫీ – పాకిస్తాన్

1986లో ఆస్ట్రల్‌ కప్‌ – పాకిస్తాన్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..