IND vs NZ, 3rd Test: ముంబైలోనూ టీమిండియాకు ఓటమే.. వాంఖడేలో అత్యధిక ఛేజింగ్ ఎంతో తెలుసా?

Highest Successful Run Chases at Wankhede Stadium: 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో భారత్ 51 పరుగులకే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, భారత జట్టు ముంబైలో గెలవాలంటే చాలా కష్టపడాల్సిందే. ఎందుకంటే, వాంఖడేలో నాలుగో ఇన్నింగ్స్ ఆడాలంటే, ఏ జట్టుకైనా వణుకుపుట్టాల్సిందే.

IND vs NZ, 3rd Test: ముంబైలోనూ టీమిండియాకు ఓటమే.. వాంఖడేలో అత్యధిక ఛేజింగ్ ఎంతో తెలుసా?
Ind Vs Nz Mumbai Test Stats
Follow us

|

Updated on: Nov 02, 2024 | 6:45 PM

Highest Successful Run Chases at Wankhede Stadium: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో రెండు రోజుల ఆట ముగిసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై 143 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకోవడానికి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకోవడానికి రేసులో ఉండాలంటే న్యూజిలాండ్‌పై ఏ టార్గెట్ అయినా ఛేదించాల్సిందే.

అయితే, ముంబైలో నాలుగో ఇన్నింగ్స్ ఆడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, ఇక్కడి పిచ్ బ్యాటర్లకు ఇబ్బందులు కలిగిస్తోంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టార్గెట్ పెరుగుతున్నా కొద్దీ టీమిండియాకు ఛేజింగ్ కష్టంగా మారుతుంది.

2000లో భారత్‌పై 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికాకు ఈ వేదికపై అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు ఉంది. ఒక జట్టు 100 ప్లస్ లక్ష్యాన్ని సాధించిన ఏకైక సందర్భం ఇదే కావడం గమనార్హం. 1984లో ఇంగ్లండ్‌పై 51 పరుగులకే ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.

వాంఖడే స్టేడియంలో అత్యధిక పరుగుల ఛేజింగ్‌లు ఇవే..

దక్షిణాఫ్రికా 164/6 vs భారతదేశం (2000)

ఇంగ్లండ్ 98/0 vs భారతదేశం (1980)

ఇంగ్లండ్ 58/0 vs భారతదేశం (2012)

భారత్ 51/2 vs ఇంగ్లాండ్ (1984)

ఆస్ట్రేలియా 47/0 vs భారతదేశం (2001).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు..
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు..
ఆటోలో పాటలు వింటూ పెద్దాయన హుషారు..ఇది కదా జీవితానికి కావాల్సింది
ఆటోలో పాటలు వింటూ పెద్దాయన హుషారు..ఇది కదా జీవితానికి కావాల్సింది
యుపీఐ లైట్ వినియోగదారులకు శుభవార్త
యుపీఐ లైట్ వినియోగదారులకు శుభవార్త
రష్యాలో ప్రభాస్‌ క్రేజ్‌.. కల్కీ రీ- రిలీజ్
రష్యాలో ప్రభాస్‌ క్రేజ్‌.. కల్కీ రీ- రిలీజ్