India Vs New Zealand 2021: సారథిగా మారి బతికిపోయాడు.. లేకుంటే టీమిండియాలో చోటు కష్టమే: గౌతమ్ గంభీర్

IND vs NZ 1st Test: కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. ముంబై టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేయనున్నాడు.

India Vs New Zealand 2021: సారథిగా మారి బతికిపోయాడు.. లేకుంటే టీమిండియాలో చోటు  కష్టమే: గౌతమ్ గంభీర్
India Vs New Zealand Ajinkya Rahane
Follow us
Venkata Chari

|

Updated on: Nov 23, 2021 | 9:12 AM

IND vs NZ 1st Test: నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అందరి దృష్టి అజింక్యా రహానేపైనే ఉంది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న రహానే ఈసారి రాణిస్తాడని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆటగాడు ఈ సిరీస్‌లో రాణించకపోతే, ఇక టీమ్ ఇండియా నుంచి కూడా ఔటయ్యే ప్రమాదంలో ఉంటాడు. ఈమేరకు గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు.

అజింక్యా రహానే అదృష్టవంతుడని గౌతమ్ గంభీర్ అన్నాడు. కాన్పూర్‌లో జట్టుకు నాయకత్వం వహించకపోయి ఉంటే, అతను ఆడకుండా ఉండేవాడని గంభీర్ పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ, ‘రహానే ప్రస్తుతం టీమ్ ఇండియాలో భాగమైనందుకు చాలా అదృష్టవంతుడు. స్వదేశంలో జరిగే సిరీస్‌లో రహానే పరుగులు చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇంగ్లండ్ టూర్‌లో రహానే ఫ్లాప్ అయ్యాడు, ఆ తర్వాత అతనిపై ప్రశ్నలు లేవనెత్తారు’ అని తెలిపాడు.

రహానే కోసం టీమ్ ఇండియాకు ఆప్షన్స్..! టీమ్ ఇండియాతో రహానెకు ఎంపికల కొరత లేదని మీకు తెలియజేద్దాం. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో, మిడిల్ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్ కూడా ఆడనున్నాడు. గిల్‌ని ఓపెనింగ్‌ నుంచి తప్పించి మిడిల్‌ ఆర్డర్‌లో ఆడాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. గంభీర్ ప్రకారం, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ అతనికి తిరిగి ఫామ్‌లోకి రావడానికి చాలా మంచి అవకాశం.

గౌతమ్ గంభీర్ కూడా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై తన అభిప్రాయాన్ని తెలిపాడు. నేను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా మారుస్తాను. పుజారా మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్‌ ఉన్నారు. కెప్టెన్‌గా ఉన్నందున రహానే ఈ జట్టులో భాగమయ్యాడు. సొంతగడ్డపై రహానే రికార్డు ఏమంత బాగోలేదని, ఈ ఆటగాడు మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని’ పేర్కొన్నాడు.

న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు టీం ఇండియా – అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ.

Also Read: Watch Video: బ్యాటింగ్‌లో ఇరగదీస్తోన్న బాలీవుడ్ నటి.. రోహిత్ కంటే మెరుగైన బ్యాటర్ అంటోన్న ప్రముఖులు.. వైరలవుతోన్న వీడియో

14 గంటల బ్యాటింగ్‌తో సంచలనం.. వరల్డ్‌కప్‌లోనూ చెరిగిపోని రికార్డులు చేసిన బ్యాట్స్‌మెన్.. ఆపై భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు..!