AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బ్యాటింగ్‌లో ఇరగదీస్తోన్న బాలీవుడ్ నటి.. రోహిత్ కంటే మెరుగైన బ్యాటర్ అంటోన్న ప్రముఖులు.. వైరలవుతోన్న వీడియో

Saiyami Kher: మహారాష్ట్ర తరపున క్రికెట్ ఆడిన బాలీవుడ్ నటి సియామీ ఖేర్. తాజాగా క్రికెట్ ఆడుతున్న ఓ వీడియో వైరల్‌గా మారింది.

Watch Video: బ్యాటింగ్‌లో ఇరగదీస్తోన్న బాలీవుడ్ నటి.. రోహిత్ కంటే మెరుగైన బ్యాటర్ అంటోన్న ప్రముఖులు.. వైరలవుతోన్న వీడియో
Saiyami Kher Rohit Sharma
Venkata Chari
|

Updated on: Nov 23, 2021 | 7:44 AM

Share

Viral Video: భారత టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచిన సంగతి తెలిసిందే. మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఈ ఆటగాడు.. మరెన్నో భారీ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తన బ్యాటింగ్‌తో ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్న హిట్‌మ్యాన్‌ కంటే ఓ బాలీవుడ్ స్టార్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుందంట. అవునండీ.. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా బాలీవుడ్ నటి ఆటకు ఎంతగానో అభిమానిగా మారిపోయాడు. అలాగే ఆమె రోహిత్ శర్మ కంటే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుందని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ నటి మరెవరో కాదు.. సియామీ ఖేర్. అనేక బాలీవుడ్ చిత్రాలలో పనిచేసిన సయామీ, సోషల్ మీడియాలో తన క్రికెట్ వీడియోలతో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. హర్ష్ గోయెంకా మాత్రమే కాదు, మన దేశ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఆమె బ్యాటింగ్‌కు వీరాభిమానిగా మారిపోయాడు.

సియామీ వీడియోపై గోయెంకా ఏమన్నారంటే.. ఇటీవల, సియామీ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంది. అందులో ఆమె సినిమా సెట్స్‌లో పొడవైన సిక్స్‌లు కొట్టినట్లు కనిపించింది. అభిమానులు కూడా నటిని ప్రశంసించారు. అయితే, ఇంతలో, గోయెంకా గ్రూప్ యజమాని హర్ష్ గోయెంక్ వ్యాఖ్యానిస్తూ, ‘మీరు రోహిత్ శర్మ కంటే మెరుగైన బ్యాటింగ్ చేశారు’ అని కామెంట్ చేశారు. దీనికి ముందు కూడా సియామీ ఖేర్ క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్వీట్ చేసింది. వీడియోలో, సయామీస్ ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడుతున్నట్లు కనిపించింది. ఈ షాట్‌కు యువీ ఫిదా అయ్యాడు. సయామీ ఫుట్‌వర్క్‌ను ప్రశంసిస్తూ కామెంట్ కూడా చేశాడు.

సచిన్‌తో ఆడాలని కోరిక.. సయామీ జాతీయ స్థాయిలో మహారాష్ట్ర తరపున క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడింది. జాతీయ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఎంపిక కూడా అయింది. అయితే ఆమెకు నటిగా రాణించాలనే కోరికతో క్రికెట్ వైపు వెళ్లలేదు. సియామ్యా ఖేర్ మిర్జియాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అనిల్‌ కపూర్‌ తనయుడు హర్షవర్ధన్‌ కపూర్‌తో ఈ సినిమాతో తెరంగేట్రం చేసింది. సియామీ తెలుగులో రేయ్ చిత్రంలో కూడా పనిచేసింది. నటించక ముందు మోడలింగ్ కూడా చేసింది. ఆమె క్రికెట్‌పై కూడా ఆసక్తిని కలిగి ఉంది. ఆమె వేగంగా బౌలింగ్ కూడా చేస్తుంది. సచిన్ టెండూల్కర్‌తో క్రికెట్ ఆడాలని సియామీ ఖేర్ కోరుకుంటోంది. సచిన్ టెండూల్కర్‌కి బౌలింగ్ చేయాలన్నది అతని కల. సచిన్‌ను కూడా క్లీన్ బౌల్డ్ చేయాలని కూడా ఆమె కోరుకుంటోంది.

Also Read: 14 గంటల బ్యాటింగ్‌తో సంచలనం.. వరల్డ్‌కప్‌లోనూ చెరిగిపోని రికార్డులు చేసిన బ్యాట్స్‌మెన్.. ఆపై భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు..!

Ind Vs Pak: క్రికెట్ రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుంది.. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే..