IPL 2022: చెన్నైతో ఆ ప్లేయర్ బంధం ముగిసినట్టేనా? వేలానికి ముందు బిగ్‌న్యూస్ చెప్పిన సీఎస్‌కే సీఈవో..!
IPL 2022 మెగా వేలం వచ్చే ఏడాది జరగనుంది. అయితే వచ్చే ఒక వారంలో జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి.
IPL 2022 Mega Auction: చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన డ్వేన్ బ్రావో, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఉండవచ్చు. కానీ అతను ఇప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్‌ను ఆడుతూనే ఉంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో మాట్లాడుతూ డ్వేన్ బ్రావో వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉందని, అయితే అతను చెన్నైకి ఆడటం ఖాయమని మాత్రం చెప్పలేదు.
ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ, ‘డ్వేన్ బ్రావో IPL 2022లో తిరిగి వస్తాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను ఫిట్‌గా ఉన్నాడు, ఆడగలడు. అయితే, కాశీ విశ్వనాథన్ డ్వేన్ బ్రావోను రిటైన్ చేసే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు.
డ్వేన్ బ్రేవో చెన్నై తరపున ఆడటంపై! వచ్చే సీజన్‌లో డ్వేన్ బ్రావో తప్పకుండా వస్తాడని, అయితే అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడడం ఖాయమని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో స్పష్టంగా చెప్పలేదు. ‘బ్రావో ఖచ్చితంగా IPL 2022లో ఆడతాడు, కానీ అతను తదుపరి సీజన్‌లో చెన్నైలో భాగమవుతాడో లేదో నేను ధృవీకరించలేను. బ్రావో చాలా ముఖ్యమైన ఆటగాడు. అయితే మనం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి. తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం.’ 38 ఏళ్ల డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో 151 మ్యాచ్‌లు ఆడి 167 వికెట్లు పడగొట్టాడు. IPL 2021లో బ్రావో 11 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టి చెన్నై విజయానికి పెద్ద సహకారం అందించాడు. బ్రావో పవర్ హిట్టింగ్ కూడా అద్భుతంగా ఉంది. కేవలం 2 ఓవర్లలో మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. అదే సమయంలో, ఈ ఆటగాడు గొప్ప ఫీల్డర్ కూడా. కాబట్టి ప్రతీ జట్టు బ్రావోను తమ జట్టులో ఉంచుకోవాలని కోరుకుంటుంది.
IPL 2022 నియమాలు.. ఒక్కో జట్టు గరిష్టంగా రూ. 90 కోట్ల వరకు కొనుగోలు చేయగలదు. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే ప్లేయర్ పర్స్ నుంచి రూ.42 కోట్లు మినహాయించుకునే ఛాన్స్ ఉంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే ఈ మొత్తం రూ. 33 కోట్ల ఖర్చు అవ్వనుంది. ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేయడం వల్ల రూ. 24 కోట్లు తగ్గుతాయి. మరోవైపు, ఆటగాడిని తమ వద్దే ఉంచుకోవడం వల్ల రూ. 14 కోట్లు ఖర్చు కానుంది. క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను కలిగి ఉన్న 3 కంటే ఎక్కువ మంది భారతీయ ఆటగాళ్లను టీమ్‌లు ఉంచుకోలేరు. ప్రస్తుత జట్టు గరిష్టంగా 2 ఆటగాళ్లను ఉంచుకోగలుగుతున్నాయి. 2 కొత్త జట్లు వేలం నుంచి 3 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోగలుగుతారు. ఇందులో ఇద్దరు భారతీయలు, ఒక విదేశీ ఆటగాడు ఉంటారు.
Also Read: India Vs New Zealand 2021: సారథిగా మారి బతికిపోయాడు.. లేకుంటే టీమిండియాలో చోటు కష్టమే: గౌతమ్ గంభీర్