IND vs ENG: ఇంగ్లండ్ పని పట్టాల్సిన టైమ్ వచ్చింది.. ఈ బలహీనతలపై దెబ్బ కొడితే సరేసరి.. సరాసరి ఫైనల్‌కు

టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌లో టీమిండియా గత ఛాంపియన్ ఇంగ్లండ్ తో తలడపనుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఇంగ్లండ్ వరుసగా నాలుగోసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ను ఆడనుంది. గత టీ20 ప్రపంచకప్‌ను సైతం ఇంగ్లండ్‌ గెలుచుకుంది.

IND vs ENG: ఇంగ్లండ్ పని పట్టాల్సిన టైమ్ వచ్చింది.. ఈ బలహీనతలపై దెబ్బ కొడితే సరేసరి.. సరాసరి ఫైనల్‌కు
India Vs England
Follow us

|

Updated on: Jun 26, 2024 | 5:08 PM

టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌లో టీమిండియా గత ఛాంపియన్ ఇంగ్లండ్ తో తలడపనుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఇంగ్లండ్ వరుసగా నాలుగోసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ను ఆడనుంది. గత టీ20 ప్రపంచకప్‌ను సైతం ఇంగ్లండ్‌ గెలుచుకుంది. గత రికార్డులు చూసుకుంటే టీమ్ ఇండియా కంటే ఇంగ్లండ్ స్కోర్లు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అయితే ఇంగ్లండ్‌కు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇంగ్లిష్ జట్టు వీటిని ఎంత దాచినా ఈ లోపాలు తెరపైకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంగ్లండ్‌కు ఈ బలహీనతలపై టీమ్ ఇండియా కూడా కన్నేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెమీఫైనల్‌కు టీం ఇండియా కూడా ప్రత్యేక వ్యూహం రచించనుంది. ప్రపంచకప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా ఇంగ్లండ్ జట్టు అడుగుపెట్టింది. అయితే ఒకానొక పరిస్థితిలో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే స్టేజ్ కు చేరుకుంది.

ఇంగ్లండ్ బలమైన జట్టు, అందులో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో ఇంగ్లండ్ టీమ్ ఎఫర్ట్ కనిపించలేదు. వారు మ్యాచ్‌లను గెలిచారు, కానీ ఒకరిద్దరు ఆటగాళ్ల బలంతోనే. ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉన్నారని ఎప్పుడూ భావించలేదు. అందుకే ఆస్ట్రేలియాపై 200 ప్లస్, దక్షిణాఫ్రికాపై 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో లోపాలు ఉన్నాయి. ఒకరిద్దరూ మాత్రమే భారీ స్కోర్లు చేస్తున్నారు. ఇక బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్‌ కు సమస్యలు ఉన్నాయి. మార్క్ వుడ్, రీస్ టాప్లీ తమదైన ఆటతీరును ప్రదర్శించడం లేదు. ఆల్ రౌండర్ గా సామ్ కరణ్ వైఫల్యం కూడా కనిపించింది. సెమీ ఫైనల్స్ కోసం తమ వ్యూహాన్ని రచిస్తున్నప్పుడు టీమ్ ఇండియా ఈ విషయాలను గ్రహించి ఉండాలి. అలాగనీ ఇంగ్లండ్ ను తేలికగా తీసుకుంటే మాత్రం 2022 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ రిపీట్ అవుతుంది.

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మమహ్మద్ సిరాజ్

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్:

జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిలిప్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..