T20 World Cup 2024: ఐసీసీ ర్యాంకుల్లో ‘టాప్’ కోల్పోయిన సూర్య .. ‘మిస్టర్ 360’ ప్లేస్‌లో ఎవరొచ్చారో తెలుసా?
టీ20 ప్రపంచకప్ తొమ్మిదో సీజన్ తుది దశకు చేరుకుంది. సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడ్డాయి. టైటిల్ కోసం నాలుగు జట్లు మాత్రమే పోరాడుతున్న నేపథ్యంలో ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ తొమ్మిదో సీజన్ తుది దశకు చేరుకుంది. సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడ్డాయి. టైటిల్ కోసం నాలుగు జట్లు మాత్రమే పోరాడుతున్న నేపథ్యంలో ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈసారి ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపులే కనిపించాయి. చాలా కాలంగా నంబర్ 1లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ స్థానం దెబ్బతింది. సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కైవసం చేసుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ట్రావిస్ హెడ్ ధారాళంగా పరుగులు సాధిస్తున్నాడు. దీంతో సూర్య స్థానాన్ని హెడ్ పట్టేశాడు. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. భారత్‌పై ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ అతనిని టీ20 ర్యాకింగ్స్ లో టాప్ ప్లేస్ కు చేర్చిందని చెప్పవచ్చు. అతని స్కోరు 4 పాయింట్లు పెరిగి 844 పాయింట్లకు చేరుకుని అగ్రస్థానానికి చేరుకుంది. ఆసక్తికరంగా, ట్రావిస్ హెడ్ గత కొన్ని గేమ్‌లలో టాప్ 10లో కూడా లేడు. కానీ టీ20 ప్రపంచకప్‌లో అతని ప్రదర్శన బాగుండడంతో టాప్‌లోకి దూసుకొచ్చాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కంటే కేవలం 2 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు మిస్టర్ 360 ప్లేయర్. అందువల్ల ట్రావిస్ హెడ్ ఎక్కువ కాలం టాప్ లో కొనసాగడం అనుమానమే. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ సెమీఫైనల్లో రాణిస్తే మరోసారి నంబర్ 1గా నిలిచే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ ర్యాంకింగ్స్ కూడా పడిపోయింది. 816 మార్కులతో అతను మూడో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 755 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు బాబర్ ఆజం మూడో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ రిజ్వాన్ 746 మార్కులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
Travis Head is now the No.1 T20 Batter in the World. The Reign of Surya Kumar Yadav got ended.#ICCRankings pic.twitter.com/SzprTRtGHR
— Richard Kettleborough (@RichKettle07) June 26, 2024
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 716 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనా రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. కాబట్టి అతని ర్యాంకింగ్ లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 672 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ 659 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో, వెస్టిండీస్‌కు చెందిన బ్రెండన్ కింగ్ 656 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. అలాగే వెస్టిండీస్‌కు చెందిన జాన్సన్ చార్లెస్ 655 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు.
Travis Head overtook Indian middle-order batsman Surya Kumar Yadav to become the No. 1 batsman in T20 cricket.#No1 #T20WorldCup pic.twitter.com/Z6LcauaCmM
— Cricket Trends. (@CricketTrends0) June 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..