IND vs ENG: ‘తప్పునాదే’.. సర్ఫరాజ్ రనౌట్‌ వివాదంపై జడేజా.. యంగ్ సెన్సేషన్‌ రియాక్షన్ ఏంటంటే?

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు చేశారు. అయితే తొలి రోజు ఆటలో హీరో మాత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌. టెస్టు అరంగేట్రం చేసిన ఈ యంగ్ సెన్సేషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సర్ఫరాజ్‌ జోరు చూస్తుంటే మొదటి టెస్టులోనే సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే జడేజా తప్పిదంతో అనూహ్యంగా రనౌటయ్యాడు

IND vs ENG: తప్పునాదే.. సర్ఫరాజ్ రనౌట్‌ వివాదంపై జడేజా.. యంగ్ సెన్సేషన్‌ రియాక్షన్ ఏంటంటే?
Sarfaraz Khan

Updated on: Feb 16, 2024 | 8:55 AM

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు చేశారు. అయితే తొలి రోజు ఆటలో హీరో మాత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌. టెస్టు అరంగేట్రం చేసిన ఈ యంగ్ సెన్సేషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సర్ఫరాజ్‌ జోరు చూస్తుంటే మొదటి టెస్టులోనే సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే జడేజా తప్పిదంతో అనూహ్యంగా రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా చేసిన తప్పిదం వల్ల సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో జడేజాపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అలా చేయలేదు. తన మంచి మనసును చాటుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు సర్ఫరాజ్. రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడాడీ దేశవాళీ సెన్సేషన్‌. తన ఇన్నింగ్స్ గురించి తన అనుభవాన్ని పంచుకున్నాడు. వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజాకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘నేను క్రీజులోకి వెళ్లగానే జడేజాను మాట్లాడాను. ఎందుకంటే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా మాట్లాడతాను. అప్పుడు నాకు మద్దతు కావాలి. అందుకు తగ్గట్టుగానే జడేజా నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు’ అని సర్ఫరాజ్‌ చెప్పుకొచ్చాడు. 82వ ఓవర్ చివరి బంతికి రవీంద్ర జడేజా సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, చిన్న పొరపాటు వల్ల సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, సర్ఫరాజ్ ఇవేమీ పట్టించుకోకుండా జడేజాపై ప్రశంసలు కురిపించాడు సర్ఫరాజ్‌.

అంతకు ముందు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. తన సోషల్ మీడియా ఖాతాలో ‘సర్ఫరాజ్ ఖాన్‌ ఔటవ్వడంపై నేను చింతిస్తున్నాను’ అని రాశాడు. ఇది నా రాంగ్ కాల్, మీరు బాగా ఆడారు’ అంటూ యంగ్‌ సెన్సేషన్‌కు సారీ చెప్పాడు. అరంగేట్రంలో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ తన తొలి సెంచరీని కోల్పోయాడు. కేవలం 66 బంతుల్లోనే 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉన్నాయి. మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 326/5 స్కోరు చేసింది. రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలతో చెలరేగారు.

ఇవి కూడా చదవండి

సర్ఫరాజ్ ఖాన్ రనౌట్.. వీడియో ఇదుగో..

సోదరుడి సర్ ప్రైజ్ కాల్..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..