IND vs ENG: రోహిత్ కొడితే అట్లుంటది మరి.. వన్డే క్రికెట్ చరిత్రలో నయా సిక్స్ హిట్టర్‌గా హిట్ మ్యాన్
Rohit Sharma 2nd Highest Six Hitter in ODI Cricket History: గస్ అట్కిన్సన్‌పై వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌లోని మొదటి సిక్స్ కొట్టాడు. దీంతో అతను వన్డేల్లో 332 సిక్సర్లు పూర్తి చేశాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 331 సిక్సర్లు బాదిన వెస్టిండీస్ బౌలర్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

Rohit Sharma 2nd Highest Six Hitter in ODI Cricket History: ఆదివారం కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. మ్యాచ్‌కు ముందు అతను క్రిస్ గేల్‌తో 331 సిక్సర్లతో సమంగా ఉన్నాడు. టీమిండియా ఛేజింగ్ సమయంలో రెండవ ఓవర్‌లో మిడ్ వికెట్‌పై గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఫ్లిక్ చేసి సిక్స్ బాదాడు. ఈ సమయంలో వెస్టిండీస్ ఓపెనర్‌ను అధిగమించాడు.
ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో టాప్ సిక్స్-హిట్టర్‌గా షాహిద్ అఫ్రిది ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో 398 ఇన్నింగ్స్‌లలో 351 సిక్సర్లు కొట్టాడు. అయితే, టీ20లు, వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లలో 624 సిక్సర్లు కొట్టి, ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును రోహిత్ కలిగి ఉన్నాడు.
రోహిత్ 151 ఇన్నింగ్స్‌లలో 205 సిక్సర్లతో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సిక్స్-హిట్టింగ్ చార్టులలో అగ్రస్థానంలో చేరాడు.
The flick first and then the loft! 🤩
Captain Rohit Sharma gets going in Cuttack in style! 💥
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/uC6uYhRXZ4
— BCCI (@BCCI) February 9, 2025
పురుషుల వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్లు..
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 369 ఇన్నింగ్స్‌లలో 351 సిక్సులు
రోహిత్ శర్మ (భారతదేశం) – 259 ఇన్నింగ్స్‌లలో 332* సిక్సులు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 294 ఇన్నింగ్స్‌లలో 331 సిక్సులు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 433 ఇన్నింగ్స్‌ల్లో 270 సిక్సర్లు
ఎంఎస్ ధోని (భారతదేశం) – 297 ఇన్నింగ్స్‌లలో 229 సిక్సులు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..