Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: నేటి నుంచే ఇండియా, ఇంగ్లాండ్‌ నాలుగో టెస్ట్‌.. బుమ్రా ప్లేస్‌లో బరిలోకి దిగేది ఎవరంటే?

ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఈ టెస్టులో విజయం సాధిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఇందుకోసం కఠోర సాధన కూడా చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌కి ఇది డూ ఆర్ డై మ్యాచ్.

IND vs ENG: నేటి నుంచే ఇండియా, ఇంగ్లాండ్‌ నాలుగో టెస్ట్‌.. బుమ్రా ప్లేస్‌లో బరిలోకి దిగేది ఎవరంటే?
India Vs England
Follow us
Basha Shek

|

Updated on: Feb 23, 2024 | 8:05 AM

రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఇప్పుడు మరో ముఖ్యమైన మ్యాచ్‌కు సిద్ధమైంది. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఇండో-ఇంగ్లండ్ నాలుగో టెస్టు ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఈ టెస్టులో విజయం సాధిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఇందుకోసం కఠోర సాధన కూడా చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. తొలి మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్‌ జట్టు శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత టీమ్ ఇండియా పునరాగమనం చేసింది. ఇంగ్లండ్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో టీమిండియా 0-1 నుంచి 2-1 ఆధిక్యంలో నిలిచింది. 4వ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అయితే సిరీస్‌లో ఇంగ్లండ్ తమ సవాల్‌ను నిలబెట్టుకోవాలంటే కనీసం డ్రా లేదా విజయం సాధించాలి.

ఎప్పటిలాగే నాలుగో టెస్టుకు ముందే గురువారం (ఫిబ్రవరి 23) ఇంగ్లండ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఇంగ్లిష్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేశారు. మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్ ఇద్దరినీ రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేశారు . ఒలీ రాబిన్సన్, షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. జస్ప్రీత్ బుమ్రాకు 4వ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకోనున్నాడు . దీంతో అతని స్థానంలో ఏ ఆటగాడు వస్తాడన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం నాల్గవ టెస్టులో మహ్మద్ సిరాజ్‌కు మద్దతుగా అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చనున్నారు. 27 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బుధవారం బెంగాల్ సహచరుడు ముఖేష్ కుమార్‌తో కలిసి నెట్స్‌లో కఠినమైన బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ లేకపోవడంతో రజత్ పటీదార్ కు మరోసారి అవకాశం దక్కే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

రాంచీలో టీమిండియా ప్రాక్టీస్..

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్.

4వ టెస్టుకు టీమిండియా (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.