AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లండ్‌తో తలపడే జట్టు ఇదే.. ఎట్టకేలకు బ్యాడ్ లక్ ప్లేయర్‌కు ఛాన్స్.. కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్..

IND vs ENG: ఈ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను పరిశీలిస్తే, రెండు రోజులు, నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండు మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌ జనవరి 12, 13 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బి మైదానంలో జరగనుంది. ఆ తర్వాత జనవరి 17 నుంచి జనవరి 20 వరకు నరేంద్ర మోదీ స్టేడియంలోని ప్రధాన మైదానంలో రెండో వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs ENG: ఇంగ్లండ్‌తో తలపడే జట్టు ఇదే.. ఎట్టకేలకు బ్యాడ్ లక్ ప్లేయర్‌కు ఛాన్స్.. కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్..
Ind Vs Eng
Venkata Chari
|

Updated on: Jan 07, 2024 | 11:35 AM

Share

India A Squad For Warm-Up Games vs England: సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా 1 వారం విశ్రాంతి తీసుకోనుంది. ఆ తర్వాత ఆ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో (India vs Afghanistan) 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. స్వదేశంలో అఫ్గాన్ సేనను ఎదుర్కొనేందుకు బీసీసీఐ (BCCI) ఏ జట్టును రంగంలోకి దించనుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత్‌కు ఇదే చివరి టీ20 సిరీస్. ఈ సిరీస్ తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ (India vs England) తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు కూడా జట్టును ఇంకా ప్రకటించలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌కు భారత ఎ జట్టును బీసీసీఐ శనివారం మధ్యాహ్నం ప్రకటించింది.

రజత్ పాటిదార్‌కు అవకాశం..

బీసీసీఐ ఎంపిక చేసిన ఇండియా ఎ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్‌లకు అవకాశం కల్పించారు. ఈ జట్టుకు కెప్టెన్సీ అభిమన్యు ఈశ్వరన్‌కు ఇచ్చారు. అతనితో పాటు టీమిండియాకు ఆడిన నవదీప్ సైనీ కూడా ఈ జట్టులో భాగమే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో సూపర్ స్టార్ అయిన రింకూ సింగ్ కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో కేఎస్ భరత్ ఉండగా, రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు.

షెడ్యూల్ ఎలా ఉందంటే?

ఈ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను పరిశీలిస్తే, రెండు రోజులు, నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండు మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌ జనవరి 12, 13 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బి మైదానంలో జరగనుంది. ఆ తర్వాత జనవరి 17 నుంచి జనవరి 20 వరకు నరేంద్ర మోదీ స్టేడియంలోని ప్రధాన మైదానంలో రెండో వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా ఎ జట్టు ఇదే..

అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, పుల్కిత్ నారంగ్, నవదీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావీరప్ప, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆకాశ్‌దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..