IND vs ENG: ఇంగ్లండ్‌ తో నాలుగో టెస్ట్‌.. బుమ్రా ప్లేస్‌లోకి బరిలోకి దిగేదెవరు? రేసులో నలుగురు ప్లేయర్లు

జస్ప్రీత్ బుమ్రా గత కొన్ని నెలలుగా వరుస మ్యాచ్‌లు ఆడుతున్నందున 4వ టెస్టు మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అందువల్ల రాంచీలో జరిగే తదుపరి మ్యాచ్‌లో బుమ్రా ఆడడని చెప్పొచ్చు. జట్టులో స్టార్‌ పేసర్‌ గా జస్ప్రీత్ బుమ్రా దూరమైతే.. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

IND vs ENG: ఇంగ్లండ్‌ తో నాలుగో టెస్ట్‌.. బుమ్రా ప్లేస్‌లోకి బరిలోకి దిగేదెవరు?  రేసులో నలుగురు ప్లేయర్లు
Team India

Updated on: Feb 20, 2024 | 11:08 AM

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు నాలుగో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడని సమాచారం. జస్ప్రీత్ బుమ్రా గత కొన్ని నెలలుగా వరుస మ్యాచ్‌లు ఆడుతున్నందున 4వ టెస్టు మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అందువల్ల రాంచీలో జరిగే తదుపరి మ్యాచ్‌లో బుమ్రా ఆడడని చెప్పొచ్చు. జట్టులో స్టార్‌ పేసర్‌ గా జస్ప్రీత్ బుమ్రా దూరమైతే.. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గాయం కారణంగా మహ్మద్ షమీ ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో రీప్లేస్ మెంట్ బౌలర్ ఎంపిక టీమ్ ఇండియాకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత జట్టులో ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ పేసర్లుగా ఉన్నారు. ముఖేష్ కుమార్ ఇప్పటికే టీమిండియా తరపున 3 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఆకాశ్ దీప్ తొలిసారిగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆకాష్ 30 మ్యాచ్‌లు ఆడి 104 వికెట్లు పడగొట్టాడు. అందుకే బుమ్రాకు బదులు బెంగాల్ పేసర్‌ని రంగంలోకి దించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కేవలం ఒక్క పేసర్‌తో ఫీల్డింగ్ చేయాలనుకుంటే మహ్మద్ సిరాజ్ మాత్రమే జట్టులో కనిపిస్తాడు. అదే విధంగా బుమ్రా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్లును తీసుకోవాలంటే అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సింగ్‌లతో భర్తీ చేయవచ్చు. కాబట్టి, రాంచీలో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

భారత టెస్టు జట్టు:

 

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, KL రాహుల్, దేవదత్ పడిక్కల్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి