IND vs ENG: మాంచెస్టర్ టెస్ట్ కోసం టీమిండియాలో 3 మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందంటే..?

మాంచెస్టర్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ బలాలకు పదును పెట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ సిరీస్ కోల్పోకూడదని ఇంగ్లండ్ టీం ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సాధించి చరిత్ర నెలకొల్పాలని కోహ్లీసేన ఆరాటపడుతోంది.

IND vs ENG: మాంచెస్టర్ టెస్ట్ కోసం టీమిండియాలో 3 మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందంటే..?
Teamindia
Follow us
Venkata Chari

|

Updated on: Sep 10, 2021 | 9:12 AM

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టీంల మధ్య 5 టెస్టుల సిరీస్‌లో చివరి టెస్టు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ మాంచెస్టర్‌లో జరగనుంది. ప్రస్తుతం టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో నిలిచింది. దీంతో ఇంగ్లండ్‌పై ఈ మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడి ఉండనుంది. టీమిండియా ఈ టెస్ట్‌ను డ్రా చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఇంగ్లండ్ మాత్రం ఈ మ్యాచులో గెలిస్తేనే తన పరువు స్వదేశంలో నిలబడుతుంది. డ్రా చేసుకున్నా టెస్ట్ సిరీస్‌ను ఓడిపోతోంది. మరోవైపు, భారత జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ముగించడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితిలో టీమిండియా ఎలాంటి టీంతో బరిలోకి దిగనుంది. లేదా విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగనున్నారా అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం మాంచెస్టర్ టెస్ట్ కోసం భారత జట్టులో 3 మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

టీమిండియా ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో 5 వ టెస్టును రద్దు చేసే అవకాశం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అంటే, ఈ టెస్ట్ మ్యాచ్ నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీమిండియాలో 3 మార్పులు..? ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు 5 వ టెస్టు నుంచి విశ్రాంతి లభిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో దాదాపు 151 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రాకు విశ్రాంతి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అతని స్థానంలో మహమ్మద్ షమిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు నుంచి షమీకి విశ్రాంతినిచ్చారు. జట్టులో మరో మార్పు రవీంద్ర జడేజా రూపంలో కనిపిస్తుంది. కాళ్ల నొప్పితో బాధపడుతున్న జడేజా స్థానంలో ఆర్. అశ్విన్‌ జట్టులో చేరనున్నట్లు సమాచారం. అంటే ఈ సిరీస్‌లో మొదటిసారిగా అశ్విన్ ఆడబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక మూడో మార్పు బ్యాటింగ్‌లో సీనియర్ ఆటగాడికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే సూర్యకుమార్ యాదవ్ లేదా హనుమ విహారి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం పొందే అవకాశం ఉంది.

5 వ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్/హనుమ విహారి, ఆర్. అశ్విన్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్

Also Read: Afghanistan T20 World Cup Squad: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో కలకలం.. టీ20 జట్టు ప్రకటించిన వెంటనే షాకిచ్చిన రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా?

West Indies T20 World Cup Squad: టీ 20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టు ప్రకటన.. సునీల్ నరైన్‌కు దక్కని చోటు

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!