West Indies T20 World Cup Squad: టీ 20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టు ప్రకటన.. సునీల్ నరైన్‌కు దక్కని చోటు
వెస్టిండీస్ టీం డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2021 టీ 20 ప్రపంచ కప్ (2021 T20 World Cup) లో ప్రవేశించనుంది. 2016 లో ఈ టైటిల్ గెలుచుకున్న తరువాత, మరలా 2012 లోనూ ఛాంపియన్‌గా నిలిచింది.
West Indies T20 World Cup Squad: డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ 2021 టీ 20 వరల్డ్ కప్ (2021 T20 World Cup) కోసం తమ జట్టును ప్రకటించింది. కీరాన్ పొలార్డ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టు ఎంపిక చేశారు. నలుగురు ఆటగాళ్లు రిజర్వ్‌లో ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ రవి రాంపాల్ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ 36 ఏళ్ల ఆటగాడు చివరిసారిగా 2015 లో వెస్టిండీస్ తరఫున టీ 20 మ్యాచ్ ఆడాడు. అయితే, కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో రవి రాంపాల్ ప్రదర్శన అద్భుతంగా ఉండడంతో అతనికి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో, ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ కూడా జట్టులోకి వచ్చాడు. వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. CPLలో తన ఆటతో విధ్వంసం సృష్టించి, టీ20 జట్టులో చోటు సంపాధించాడు. అయితే వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ని మాత్రం ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ రిజర్వ్‌లో ఉన్నాడు.
సునీల్ నరైన్ టీ 20 లీగ్‌లలో ఆడుతున్నాడు. అతను సీపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఐపీఎల్‌లో పాల్గొంటున్నాడు. ఇంగ్లండ్ ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో కూడా ఆడారు. కానీ, వెస్టిండీస్‌టీంలో మాత్రం భాగం కాలేకపోతున్నాడు. 2019 లో చివరి అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ ఆడాడు. కానీ, దీని తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా లేడని తెలుస్తోంది. టీ 20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ తరఫున హేడెన్ వాల్ష్ మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. స్పిన్ ఆల్ రౌండర్లు ఫాబియన్ అలెన్, రోస్టన్ చేజ్ అతనితో ఉన్నారు. మరో స్పిన్నర్ అకిల్ హోస్సేన్ రిజర్వ్‌లో భాగంగా ఎంపిక చేశారు..
బ్రావో, గేల్ కూడా.. డిసెంబర్ 2019 లో అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన డ్వేన్ బ్రావో ప్రపంచ కప్ ఆడుతున్నాడు. అతను ప్రస్తుతం గాయపడినప్పటికీ, ప్రపంచ కప్ వరకు ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నారు. కార్లోస్ బ్రాత్‌వైట్ జట్టులో లేడు. 2016 ఫైనల్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టడం ద్వారా వెస్టిండీస్ టీ 20 ప్రపంచ ఛాంపియన్‌గా రెండోసారి నిలిచింది. బ్రాత్‌వైట్ ఇటీవలి ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. లెజెండరీ ప్లేయర్ క్రిస్ గేల్‌ను కూడా జట్టులో చేర్చారు. గేల్‌కు ప్రస్తుతం 41 సంవత్సరాలు. కానీ, అతను టీ 20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా ఉండడంతో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్ జట్టు కీరాన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మెయర్, ఎవిన్ లూయిస్, ఓబెడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్, లెండెల్ సిమన్స్, ఒషాన్ వాల్ థామస్ హామన్స్ జూనియర్.
రిజర్వ్ ప్లేయర్లు – జాసన్ హోల్డర్, అకిల్ హోస్సేన్, షెల్డన్ కాట్రెల్, డారెన్ బ్రావో.
CWI announces squad for the ICC T20 World Cup 2021? #MissionMaroon #T20WorldCup
World Cup Squad details⬇️https://t.co/qoNah4GTZS pic.twitter.com/IYGQNBobgi
— Windies Cricket (@windiescricket) September 9, 2021
Also Read: IND vs ENG: ఆటగాళ్లందరికీ నెగిటివ్.. మాంచెస్టర్ టెస్ట్‌పై వీడిన ఉత్కంఠ
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోలుగా ఆ ఇద్దరిలో ఒకరు.?