Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోలుగా ఆ ఇద్దరిలో ఒకరు.?

Sourav Ganguly: ''సచిన్ బయోపిక్‌లో.. మాస్టర్ బ్లాస్టర్ ఎలా క్రికెట్ గాడ్ అయ్యాడని తెలుసుకోవచ్చు.. అలాగే ధోని బయోపిక్‌లో.. మిస్టర్ కూల్ అధ్యాయాన్ని చూడొచ్చు..

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోలుగా ఆ ఇద్దరిలో ఒకరు.?
Sourav Ganguly
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 09, 2021 | 4:53 PM

”సచిన్ బయోపిక్‌లో.. మాస్టర్ బ్లాస్టర్ ఎలా క్రికెట్ గాడ్ అయ్యాడని తెలుసుకోవచ్చు.. అలాగే ధోని బయోపిక్‌లో.. మిస్టర్ కూల్ అధ్యాయాన్ని చూడొచ్చు.. అయితే టీమిండియా ఆధిపత్యాన్ని చూడాలంటే.. ఖచ్చితంగా దాదా బయోపిక్ రావాలి” ఇదే క్రికెట్ ఫ్యాన్స్ మాట. ఇక ఆ మాట త్వరలోనే నిజం కాబోతోంది.

బెంగాల్ టైగర్, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితచరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుంది. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. అద్భుత ప్లేయర్‌గానే కాదు.. స్పూర్తిదాయక కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీకి ఎంతో గుర్తింపు ఉంది.

దాదా బయోపిక్‌ తీసేందుకు నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఇప్పటికే రెడీ అయ్యారు. లవ్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే గంగూలీ పాత్రను ఎవరు పోషించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.? ప్రస్తుతం బీ-టౌన్‌లో కండలవీరుడు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పాటు క్రికెట్‌ కెరీర్‌లో సౌరవ్ గంగూలీ సాధించిన అద్భుత విజయాల ఆధారంగా మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.