Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs South Africa: డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా.. ఈ సారైనా టెస్ట్ సిరీస్‌ గెలిచేనా..?

భారత్ చివరిసారిగా 2018 లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయిన భారత్.. టీ 20, వన్డే సిరీస్‌ను గెలుచుకున్నాడు. టీమిండియా ఈ దేశంలో తొలిసారిగా పరిమిత ఓవర్ల సిరీస్‌ను గెలుచుకుంది.

India vs South Africa: డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా  పర్యటనకు టీమిండియా.. ఈ సారైనా టెస్ట్ సిరీస్‌ గెలిచేనా..?
Indian Team
Follow us
Venkata Chari

|

Updated on: Sep 10, 2021 | 9:58 AM

India Vs South Africa: ఈ ఏడాది చివరిలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 2021 లో దక్షిణాఫ్రికా వెళ్తుంది. ఈ పర్యటన జనవరి 2022 లో ముగుస్తుంది. భారత్ ఇక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ 20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇండియా-దక్షిణాఫ్రికా సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 25న ముగుస్తుంది. ముందుగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడతారు. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఉంటుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య చివరి సిరీస్ మార్చి 2020 లో జరిగింది. ఈ సిరీస్ భారతదేశంలో జరిగింది. అయితే మొదటి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు కరోనా వైరస్ కేసులు బయటపడడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికాతో ఇంతకుముందు పొట్టి క్రికెట్ సిరీస్ ఆగష్టు 2020 లో ప్లాన్ చేశారు. కానీ, కరోనాతో అది కూడా జరగలేదు. దాని తరువాత సెప్టెంబర్-అక్టోబర్ 2021 లో జరిగింది. కానీ, కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో ఈ సిరీస్ ఇబ్బందుల్లో పడింది. అదే సమయంలో, భారతదేశం చివరిసారిగా 2018 లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అయితే, అప్పుడు టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. కానీ, టీ 20, వన్డే సిరీస్‌ను గెలుచుకుని భారత్ చరిత్ర నెలకొల్పింది. టీమిండియా ఈ దేశంలో తొలిసారిగా పరిమిత ఓవర్ల సిరీస్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం 2021 చివరిలో టెస్టుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం భారతదేశం విజయానికి ప్రధాన పోటీదారుగా ఉండనున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారిగా భారత్ టెస్ట్ సిరీస్ గెలుస్తుందో లేదో చూడాలి.

బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో సిరీస్‌లు దక్షిణాఫ్రికా దేశీయ క్యాలెండర్‌లో కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికా దేశీయ క్యాలెండర్ నెదర్లాండ్స్‌తో మూడు వన్డేలతో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లు నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు జరుగుతాయి. ఈ సిరీస్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ కింద ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు సెంచూరియన్‌లో జరుగుతాయి. భారత్‌తో సిరీస్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో ఇంకా నిర్ణయించలేదు. భారత సిరీస్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. రెండు టెస్టులు, మూడు టీ 20 లు ఆడాల్సి ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా హోమ్ సిరీస్ ఉంది.

Also Read: IND vs ENG: మాంచెస్టర్ టెస్ట్ కోసం టీమిండియాలో 3 మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందంటే..?

రెండు దేశాల తరపున క్రికెట్ ఆడాడు.. పరిమిత ఓవర్లలో దుమ్ము లేపి, టెస్టుల్లో మాత్రం బోల్తా పడ్డాడు.. అతనెవరంటే?

Afghanistan T20 World Cup Squad: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో కలకలం.. టీ20 జట్టు ప్రకటించిన వెంటనే షాకిచ్చిన రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా?