Hardik Pandya: నేను ఆల్ రౌండర్‌గా మారడానికి ఆయనే కారణం..! ఆసక్తికర విషయాలు పంచుకున్న హార్దిక్ పాండ్యా
ప్రస్తుత క్రికెటర్లలో బెస్ట్ ఆల్ రౌండర్‌గా ఎదిగిన టీమిండియా ప్లేయర్, ముంబై టీం కీలక ఆటగాడు హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి జరిగే ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
Hardik Pandya: ప్రస్తుత క్రికెటర్లలో బెస్ట్ ఆల్ రౌండర్‌గా ఎదిగిన టీమిండియా ప్లేయర్, ముంబై టీం కీలక ఆటగాడు హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి జరిగే ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఐపీఎల్ 2021 రెండవ సీజన్‌లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తరపున జరగనుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అయితే, క్రికెట్‌లోకి ఎంటర్ అయిన తరువాత అనుకోకుండానే ఆల్ రౌండర్‌గా మారినట్లు తెలిపాడు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో కలిసి హార్ధిక్ పాండ్యా ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాడు.
ఇందులో ‘ఆల్‌రౌండర్‌గా ఎలా మారావు?’అని కపిల్ దేవ్ అడిగిన ఓ ప్రశ్నకు హార్ధిక్ పాండ్య బదులిస్తూ ‘నేను తొలుత బ్యాట్స్‌మెన్‌గానే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. 3వ స్థానంలో బరిలోకి దిగేవాడిని. అయితే, అండర్-19 మ్యాచుల్లో తరచుగా బౌలింగ్ చేసేవాడిని. ఈ సందర్భంలో కిరణ్ మోరె అకాడమీలో ఉన్పప్పుడు కోచ్ సనత్ కుమార్ సర్ నా బౌలింగ్‌ను పరిశీలించాడు. అలా నాతో బౌలింగ్ చేపించాడు. మొదటి సారే 5 వికెట్లు తీశాను. ఈ తర్వాత మ్యాచుల్లో కూడా బౌలింగ్ చేయాలని ఆదేశించారు. అనంతరం నెల రోజుల్లోనే రంజీ జట్టుకు ఎంపికయ్యాను. మొత్తానికి నేను అనుకోకుండానే ఆల్ రౌండర్‌గా అవతారం ఎత్తాను’ అని యంగ్ ప్లేయర్ తెలిపాడు.
Also Read: IND vs ENG: మాంచెస్టర్ టెస్ట్ కోసం టీమిండియాలో 3 మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందంటే..?