AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng 2nd Test Live Streaming : ఈ రోజు నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్.. లార్డ్స్‌లో భారత్‌కి కేవలం రెండు విజయాలు మాత్రమే..

Ind vs Eng 2nd Test Live Streaming : లార్డ్స్‌లో ఈ రోజు నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Ind vs Eng 2nd Test Live Streaming : ఈ రోజు నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్.. లార్డ్స్‌లో భారత్‌కి కేవలం రెండు విజయాలు మాత్రమే..
Ind Vs Eng
uppula Raju
|

Updated on: Aug 12, 2021 | 7:58 AM

Share

Ind vs Eng 2nd Test Live Streaming : లార్డ్స్‌లో ఈ రోజు నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా వర్షం వల్ల మొదటి మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భారత్, ఇంగ్లాండ్ కోరుకుంటున్నాయి. అయితే లార్డ్స్‌లో భారత రికార్డు అంత మెరుగ్గా లేదు. ఇక్కడ ఆడిన 18 టెస్టుల్లో కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. 12 టెస్టుల్లో ఓడిపోయింది. అదే సమయంలో 4 టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇంగ్లాండ్‌లో భారత జట్టు తన 64 వ టెస్టు ఆడనుంది.

రెండో టెస్టుకు ముందు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అండర్సన్ కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. భారత శిబిరంలో కూడా ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను రెండో టెస్టులో ఆడలేకపోతున్నాడు. అతడి స్థానంలో అశ్విన్ అవకాశం పొందవచ్చు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ముఖ్యం..

1. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆగస్టు 12 నుంచి భారత్ -ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ మక్కాలో జరుగుతుంది. 3. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ జరుగుతుంది? సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

MS Dhoni: క్ష‌మాప‌ణ చెప్పిన జెమీమా రోడ్రిగ్స్.. అయినా శాంతించ‌ని ధోని అభిమానులు

టీ20 ప్రపంచకప్‌ టీంను ప్రకటించిన కివీస్… టీ20లో 3 సెంచరీలు చేసిన ఆటగాడికి చోటు మిస్.. రిటైర్మెంట్ ఇచ్చేశారా అంటూ ఆవేదన

England vs India 2nd Test : రెండో టెస్ట్‌కి ఆ ఇద్దరు పేసర్లు అనుమానమే..! ఎవరో తెలుసా..?