
వైజాగ్ టెస్టులో టీమిండియా అదరగొట్టింది. హైదరాబాద్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌పై 106 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలోనాలుగో రోజు ఇంగ్లండ్ 292 పరుగులక ఆలౌటైంది. జస్ ప్రీత్ బుమ్రా, రవి చంద్రన్ చెరో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ ఆధారంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. జైస్వాల్ కెరీర్‌లో ఇదే తొలి డబుల్ సెంచరీ. అనంతరం ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ సెంచరీ మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో బాగానే ఆడింది. అయితే భారత స్పిన్నర్ల ముందు నిలవలేకపోయింది. బెన్ డకెట్‌ను అశ్విన్ అవుట్ చేయగా, ఆ తర్వాత రెండో రోజు రెహాన్ అహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ ఇంగ్లండ్ ను రెండో దెబ్బ కొట్టాడు. ఓలీ పోప్ అశ్విన్, జో రూట్ అశ్విన్ స్పిన్ మాయాజాలానికి చిక్కారు. ఇక ఇంగ్లండ్ తరుపున అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రౌలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసినా కుల్దీప్ యాదవ్ దెబ్బకు బలి అయ్యాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన వికెట్ ను టీమిండియాకు బహుమతిగా ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ వేసిన డైరెక్ట్ త్రోతో అతను రనౌట్ అయ్యాడు. చివర్లో బెయిర్‌స్టో, హార్ట్లీ, షోయబ్ బషీర్‌లను అవుట్ చేయడం ద్వారా బుమ్రా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
CASTLED! ⚡️⚡️
Jasprit Bumrah wraps things up in Vizag as #TeamIndia win the 2nd Test and level the series 1⃣-1⃣#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/KHcIvhMGtD
— BCCI (@BCCI) February 5, 2024
A splendid bowling display on Day 4 powers #TeamIndia to a 106-run win 🙌
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/P9EXiY8lVP
— BCCI (@BCCI) February 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..