IND vs BAN: వరల్డ్ రికార్డు జస్ట్ మిస్.. ఉప్పల్‌లో చెలరేగిన టీమిండియా బ్యాటర్లు.. బంగ్లా ముందు భారీ టార్గెట్
ఉప్పల్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేస్తూ భారీ స్కోరు సాధించారు. సంజూ శాంసన్ ( 47 బంతుల్లో 111, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( 35 బంతుల్లో 75, 8 ఫోర్లు, 5 సిక్సులు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్స్ లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో34, 1 ఫోర్, 4 సిక్స్ లు) కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు.
ఉప్పల్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేస్తూ భారీ స్కోరు సాధించారు. సంజూ శాంసన్ ( 47 బంతుల్లో 111, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( 35 బంతుల్లో 75, 8 ఫోర్లు, 5 సిక్సులు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్స్ లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో34, 1 ఫోర్, 4 సిక్స్ లు) కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఒకానొక దశలో టీమిండియా బ్యాటర్ల జోరు చూస్తుంటే అంతర్జాతీయ టీ20ల్లో భారీ స్కోరు రికార్డు బద్దలవుతుందని చాలా మంది భావిం చారు. ఆఖర్లో బ్యాటర్లు తడబడడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (314) కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా భారత్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 314 పరుగుల ప్రపంచ రికార్డును నేపాల్ పేరిట ఉంది. కొన్ని నెలల క్రితం మంగోలియా తో జరిగిన మ్యాచ్ లో నేపాల్ ఈ ఘనత సాధించింది.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది సరైన నిర్ణయమని అర్థమయ్యేందుకు ఎక్కువ సేపు పట్టలేదు.. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు టీమ్ ఇండియా సాధించిన అతిపెద్ద స్కోరు ఇదే. అంతకుముందు 2017లో శ్రీలంకపై టీమిండియా 260 పరుగులు చేసింది. అదే సమయంలో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 250 పరుగుల స్కోరును అందుకోవడం ఇది మూడోసారి.
A six from the birthday boy to finish the innings off in style! 🥳#TeamIndia finish with 297/6 on board 🔥
Live – https://t.co/ldfcwtHGSC#TeamIndia | #INDvBAN | @rinkusingh235 | @IDFCFIRSTBank pic.twitter.com/HkaIzoR0Kh
— BCCI (@BCCI) October 12, 2024
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్:
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తన్జిమ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..