IND vs BAN: రెండో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్‌.. ప్రాక్టీస్‌ సెషనల్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు గాయం

|

Dec 21, 2022 | 4:38 PM

ఇప్పటికే గాయం కారణంగా రోహిత్‌ సేవలను కోల్పోయిన టీమిండియాకు మరో తలనొప్పి మొదలైంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ చేతికి గాయమైనట్లు తెలుస్తుంది.

IND vs BAN: రెండో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్‌.. ప్రాక్టీస్‌ సెషనల్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు గాయం
Kl Rahul
Follow us on

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే భారత్‌కు భారీ షాక్‌ తగిలేలా ఉంది. ఇప్పటికే గాయం కారణంగా రోహిత్‌ సేవలను కోల్పోయిన టీమిండియాకు మరో తలనొప్పి మొదలైంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ చేతికి గాయమైనట్లు తెలుస్తుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘కేఎల్ రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. అతని చేతికి గాయమైంది. ప్రస్తుతానికైతే రాహుల్ మెరుగ్గా కనిపిస్తున్నాడు. అంతా బాగుండాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రెండో టెస్టుకు అతను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టులో కేఎల్ రాహుల్ ఆడాలి. లేకపోతే టీమిండియాకు కెప్టెన్సీతో పాటు ఓపెనింగ్‌ సమస్యలూ ఎదురవుతాయి.

కాగా చటోగ్రామ్‌లో జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో మ్యాచ్‌నూ గెల్చుకుని సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకుంటుంది భారత జట్టు. తద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో మరింత ముందుకు అడుగేయాలని భారత్‌ భావిస్తోంది. కాగా రెండో టెస్టులో టీమిండియాలోకి వస్తాడని చెప్పిన రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. దీంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. దీనికి తోడు నవదీప్ సైనీ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ కూడా దూరమైతే టీమిండియాకు ఎదురుదెబ్బేనని భావించవచ్చు. కాగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఈ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు యాదవ్ ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ జట్టు:

జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటెన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్ హసన్, పి. మోమినుల్ హక్, రెహ్మాన్ రాజా, తస్కిన్ అహ్మద్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..