IND vs BAN: బంగారు పతకమే లక్ష్యంగా.. మరికొన్ని క్షణాల్లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సెమీస్ పోరు
హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు అందరి దృష్టి పురుషుల జట్టుపైనే ఉంది. పురుషుల ఈవెంట్‌లో కూడా భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. అక్కడ నేపాల్‌పై గెలిచింది. ఆ మ్యాచ్‌లో భారత్ తన బ్యాటింగ్ సత్తా చాటినప్పటికీ నేపాల్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. భారత జట్టు 202 పరుగులు చేసి నేపాల్‌ను 179 పరుగులకే పరిమితం చేసింది.

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. కానీ టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే అంతకంటే ముందే యువ భారత జట్టు హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. చైనాలో జరుగుతున్న 19వ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 6) ఉదయం భారత యువ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. నేపాల్‌పై కష్టపడి నెగ్గిన రుతురాజ్ గైక్వాడ్ సేన సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో, భారత మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు అందరి దృష్టి పురుషుల జట్టుపైనే ఉంది. పురుషుల ఈవెంట్‌లో కూడా భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. అక్కడ నేపాల్‌పై గెలిచింది. ఆ మ్యాచ్‌లో భారత్ తన బ్యాటింగ్ సత్తా చాటినప్పటికీ నేపాల్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. భారత జట్టు 202 పరుగులు చేసి నేపాల్‌ను 179 పరుగులకే పరిమితం చేసింది.
బంగ్లాదేశ్‌తో జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టులో అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న కొంతమంది ఆటగాళ్లు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఈ పోటీ చాలా సులభం కాదు. గత మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మెరుపు సెంచరీ సాధించగా, రింకూ సింగ్ దూకుడైన ఇన్నింగ్స్‌తో ఫినిషింగ్ టచ్‌ను ఉంచాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో అందరూ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అందుకే వారు ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సందే.
బౌలర్ల ప్రదర్శన దాదాపు బాగానే ఉంది. అయితే లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ధారాళంగా పరుగులిస్తున్నాడు. గత మ్యాచ్‌లో వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మరోసారి ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బందిగా మారనున్నాడు. గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
భారత జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, ఆర్ సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్, ముఖేష్ అహ్మద్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








