World Cup: 1544 రోజుల రివెంజ్.. 4 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ను దెబ్బకు దెబ్బ తీసిన కివీస్..
283 పరుగుల టార్గెట్.. 36.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ బ్యాటర్లు ఊదేశారు. దీంతో 82 బంతులు మిగిలి ఉండగానే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఉతికారేసి.. 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ వన్డే వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ చేతిలో 1544 రోజుల క్రితం ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ వివరాలు ఇలా..

283 పరుగుల టార్గెట్.. 36.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ బ్యాటర్లు ఊదేశారు. దీంతో 82 బంతులు మిగిలి ఉండగానే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఉతికారేసి.. 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ వన్డే వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ చేతిలో 1544 రోజుల క్రితం ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
వన్డే వరల్డ్‌కప్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విల్ యంగ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితేనేం మరో ఓపెనర్ డెవాన్ కాన్వె(152), వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర(123) రీ-సౌండ్ వచ్చే సెంచరీల మోత మోగించారు. 36.2 ఓవర్లలోనే మరో వికెట్ పడకుండా.. టార్గెట్‌ను ఉఫ్ అని ఊదేసి.. జట్టుకు విజయాన్ని అందించారు. ఇదే క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్‌కు 273 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు బ్యాటర్లను ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ టీం.. ఆరుగురు బౌలర్లను ఉపయోగించినా.. వారందరినీ ఊచకోత కోస్తూ.. వరుస బౌండరీలు, సిక్సర్ల మోత మోగించారు కాన్వె, రచిన్. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ ఒక వికెట్ తీశాడు.
Two quickfire hundreds from Rachin Ravindra and Devon Conway helped New Zealand to a comfortable win in the #CWC23 opener 👊#ENGvNZ 📝: https://t.co/9XyPD7lF90 pic.twitter.com/qR6tnjQLGB
— ICC Cricket World Cup (@cricketworldcup) October 5, 2023
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆ జట్టులో జో రూట్(77) అర్ధ సెంచరీ చేయగా.. జోస్ బట్లర్(43), బెయిర్‌స్టో(33) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ జట్టులోని 11 మంది బ్యాటర్లు రెండంకెల స్కోర్ చేయగా.. రూట్ మినహా ఇంకెవ్వరూ కూడా ఆ స్కోర్‌ను సద్వినియోగం చేసుకుని.. భారీ పరుగులు చేయలేకపోయారు. ఇక చివర్లో రషీద్(15), వుడ్(13) వేగంగా పరుగులు చేయడంతో ఇంగ్లాండ్‌కు 282 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. కివీస్ బౌలర్లలో హెన్రీ 3 కీలక వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా.. ఫిలిప్స్, శాంట్నర్ చెరో రెండు వికెట్లు.. బౌల్ట్, రవీంద్ర తలో వికెట్ తీశారు.
కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రచిన్ రవీంద్రకు దక్కింది. అలాగే 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఎదుర్కున్న పరాభవానికి దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ తిరిగిచ్చేసింది. ఇంగ్లాండ్‌పై రీ-సౌండింగ్ విజయంతో వన్డే ప్రపంచకప్ టోర్నీని విజయంతో మొదలుపెట్టింది కివీస్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..