World Cup: రోహిత్‌సేన తొలి మ్యాచ్‌కు ముందే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్..
క్రికెట్ ప్రపంచకప్ సందడి మొదలైంది. నాలుగేళ్లకోసారి క్రికెట్ అభిమానులకు పండుగ దినాలు ఇవే. సెప్టెంబర్ 5 నుంచి మొదలైన ఈ ప్రపంచకప్ సమరం నవంబర్ 19న ముగుస్తుంది. ఆరంభం నుంచే అంచనాలు అమాంతం పెరుగుతూ ఫైనల్‌తో మరింత హైప్‌కు చేరే ఈ మెగా టోర్నీలోని ఒక్కో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతాయి. అయితే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కి మాత్రం..

క్రికెట్ ప్రపంచకప్ సందడి మొదలైంది. నాలుగేళ్లకోసారి క్రికెట్ అభిమానులకు పండుగ దినాలు ఇవే. సెప్టెంబర్ 5 నుంచి మొదలైన ఈ ప్రపంచకప్ సమరం నవంబర్ 19న ముగుస్తుంది. ఆరంభం నుంచే అంచనాలు అమాంతం పెరుగుతూ ఫైనల్‌తో మరింత హైప్‌కు చేరే ఈ మెగా టోర్నీలోని ఒక్కో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతాయి. అయితే భారత్‌లో అభిమానుల్లో ఒక ఆందోళన మొదలైంది. ప్రపంచకప్ మొదలవడానికి ముందుగా జరిగే వార్మప్ మ్యాచ్‌లు దాదాపుగా వర్షార్పణం అయ్యాయి. వర్షాలు భారత క్రికెట్ అభిమానులను నిరుత్సాహపరుస్తున్నాయ్. గౌహతి, తిరువనంతపురంలో జరగాల్సిన రెండు వార్మప్ మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండా రద్దయ్యాయి. అకాల వర్షాలే ఇందుకు కారణం.
ఇప్పటికీ కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల తిరోగమనం కారణంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న నెల రోజుల్లో అక్కడక్కడా వాన గండం ఉందని వాతావరణ శాఖ అధికారులు చేస్తోన్న ప్రకటనలు క్రికెట్ అభిమానులకు నిరుత్సాహం కలిగిస్తున్నాయ్.
ప్రపంచ క్రికెట్ సమరంలో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరగనుంది. సెప్టెంబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుండగా ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. మ్యాచ్‌ను చూసేందుకు ఇప్పటికే టికెట్స్ కొనుగోలు చేసిన ఫ్యాన్స్ చెన్నై వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి కారణంగా మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. చెన్నై, శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ సాయంత్రం అయితే చాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. గత కొద్దిరోజులుగా అక్కడ కనిపించే పరిస్థితి. ఇలాగే ఉంటే వార్మప్ మ్యాచ్ తరహాలో మ్యాచ్ జరుగుతుందా లేక అర్ధాంతరంగా ఆగిపోతుందా అనే టెన్షన్‌లో ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్.
అయితే వాతావరణ శాఖ ఇచ్చిన తాజా అప్డేట్ క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా చేసింది. సోషల్ మీడియా వేదికగా ముందే సక్సెస్ వచ్చినంత సంతోషంతో ట్వీట్స్ చేస్తూ భారత్ విజయం వరుణుడి దయతో మొదలైనట్టే అంటున్నారు క్రికెట్ అభిమానులు. అల్పపీడన ప్రభావం, రుతుపవనాల తిరోగమనం కారణంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు రెండు రోజుల తర్వాత ఉండవని అక్టోబర్ 6 తర్వాత వర్షాలు కురిసే అవకాశం తక్కువ అని అప్డేట్ ఇచ్చింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దే లేదని చెప్పాలి.
ప్రపంచకప్ రెండో మ్యాచ్‌కు వరుణుడు అడ్డురాడు..
The #COMK Matchday #Weather inference for Matchday 2 of #CricketWorldCup2023 on 6th Oct. ’23 at #Hyderabad between #Netherlands and #Pakistan. Once again very less chance for #Rains to play a spoil sport. #CWC23 #NedVsPak pic.twitter.com/TrWT40O2ek
— Chennai Rains (COMK) (@ChennaiRains) October 5, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
