Ind vs Aus 3rd T20I: ఉప్పల్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పుందా? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?
Hyderabad: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉప్పల్ టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేటి సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Hyderabad: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉప్పల్ టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేటి సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1 సమానంగా ఉండడంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ కానుంది. దీనికి తోడు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంతో గత రెండేళ్లుగా ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఈ నేపథ్యంలో భారత్- ఆసీస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీగానే రానున్నారని తెలుస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా కొన్ని నగరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండో మ్యాచ్ వేదికైన నాగ్‌పూర్‌లోనూ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను కేవలం 8 ఓవర్లకు కుదించడంలో క్రికెట్ ఫ్యాన్స్ పూర్తి మజాను ఆస్వాదించలేకపోయారు.
మరి హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌కు కూడా వరుణుడి గండం ముప్పు ఉందేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు.. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉప్పల్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో చాలా తేలికపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని.. మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం కలగదని పేర్కొంది. అయితే రోజంతా ఆకాశం మబ్బులు పట్టి ఉంటుందని తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..