Ind vs Aus 3rd T20I: 9 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను ఓడించే ఛాన్స్.. వరల్డ్ రికార్డ్ దిశగా టీమిండియా.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీం ఇండియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. అదే సమయంలో వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది.
India vs Australia, 3rd T20I: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. భారత గడ్డపై టీమ్‌ఇండియాను ఓడించడం చాలా కష్టమైనప్పటికీ, ఆస్ట్రేలియా ప్రతి సిరీస్‌లోనూ భారత్‌కు గట్టి పోటీనిస్తుంది. 2013 నుంచి తమ గడ్డపై ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను టీమిండియా గెలవలేదు. చివరిసారిగా 9 సంవత్సరాల క్రితం 2013లో 1-0లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. ఆ తర్వాత 2017లో జరిగిన టీ20 సిరీస్ 1-1తో సమమైంది. అదే సమయంలో చివరి T20 సిరీస్ 2019 లో జరిగింది. దీనిని ఆస్ట్రేలియా జట్టు 2-0 తేడాతో గెలుచుకుంది.
ఈ సిరీస్ గురించి మాట్లాడితే, మొహాలీలో ఆడిన మొదటి టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా, నాగ్‌పూర్ టీ20లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ సిరీస్‌లో పునరాగమనం చేసింది.
పిచ్ ఎలా ఉంది?
మ్యాచ్ జరుగుతున్న కొద్దీ హైదరాబాద్ పిచ్ నెమ్మదించడం మొదలవుతుంది. ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం తప్పు అని నిరూపించవచ్చు. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసే జట్టు సగటు స్కోరు 150 నుంచి 170 పరుగుల మధ్య ఉంటుంది. ఐపీఎల్‌లో చాలా సార్లు తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఛేజింగ్ చేయలేకపోయేవి.
లైవ్ చూడడం ఎలా..
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అలాగే డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు.
హైదరాబాద్ స్టేడియంలో భారత్ ప్రదర్శన ఎలా ఉంది?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీం ఇండియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. అదే సమయంలో వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా ఒకసారి 2017లో టీ20 మ్యాచ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చింది. కానీ, ఆ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయింది.
భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..
హైదరాబాద్ టీ20లో భారత జట్టు తన బౌలింగ్‌ను పటిష్టం చేసుకోగలదు. ఇటువంటి పరిస్థితిలో రిషబ్ పంత్ ప్లేయింగ్ XI నుంచి తొలగించే ఛాన్స్. అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్ తిరిగి రావొచ్చు. భువనేశ్వర్ రెండో టీ20 ఆడలేదు.
జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యకు తెరపడింది. ఇటువంటి పరిస్థితిలో భువనేశ్వర్ కుమార్ ఓపెనింగ్ చేయగలడు. అదే సమయంలో బుమ్రా పేస్ బాధ్యతను తీసుకోనున్నాడు.
రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్.
ఆస్ట్రేలియా జట్టు..
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, ఆడమ్ జంపా, పాట్ కమిన్స్, జోస్ హాజిల్‌వుడ్.