IND vs AUS: సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? లేటెస్ట్ అప్డేట్ ఇదిగో

|

Jan 04, 2025 | 4:59 PM

సిడ్నీ టెస్ట్ రెండో రోజు టీమిండియా రేసు గుర్రం జస్ ప్రీత్ బుమ్రా అనూహ్యంగా మైదానం వీడాడు. అంతేకాదు సహాయక సిబ్బందితో కలిసి కారులో బయటకు వెళ్లిపోయాడు. దీంతో బుమ్రా గాయపడ్డాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కెప్టెన్ గాయానికి సంబంధించిన ప్రధాన అప్‌డేట్ బయటకు వచ్చింది.

IND vs AUS: సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? లేటెస్ట్ అప్డేట్ ఇదిగో
Jasprit Bumrah
Follow us on

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఐదో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట కూడా ముగిసింది. ఈ రెండు రోజులూ బౌలర్ల ఆధిపత్యమే కనిపించింది. అయితే కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మైదానాన్ని వీడడంతో టీమ్ ఇండియా శిబిరంతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. బుమ్రా తీవ్రంగా గాయపడ్డాడని, అందుకే అత్యవసరంగా మైదానాన్ని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లోని ప్రతి ఇన్నింగ్స్‌లో బుమ్రా తన బౌలింగ్‌తో తనదైన ముద్ర వేశాడు. అలాగే కీలక సమయంలో పరుగులు చేసి టీమిండియా బ్యాటింగ్ కు అండగా నిలిచాడు. అయితే సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు బుమ్రా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు. అయితే ఆ తర్వాత బాధతో మైదానం వీడాల్సి వచ్చింది. మూడో రోజు బుమ్రా ఆడడంపై ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అప్డేట్ ఇచ్చాడు. బుమ్రా వెన్ను సమస్యతో బాధపడుతున్నాడని, వైద్య బృందం అతనిని పరిశీలిస్తోందన్నాడు.

ఇదిలా ఉంటే బుమ్రా మూడో రోజు ఆడతాడా లేదా? క్రికెట్ అభిమానులకు ఇదే ప్రశ్న. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. మూడో రోజు ఉదయమే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. కాగా బీజీటీ సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకంజలో ఉంది. అందువల్ల సిరీస్‌ సమం కావాలంటే టీమ్‌ఇండియా ఐదో మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. అందుకే అందరి దృష్టి బుమ్రాపైనే ఉంది.

ఇవి కూడా చదవండి

స్కానింగ్ కోసం వెళుతున్న బుమ్రా.. వీడియో

కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ 4 పరుగులతో కలిపి టీమిండియా మొత్తం 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ క్రీజులో ఉన్నారు. రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI:

పాట్ కమిన్స్ (కెప్టెన్), సామ్ కాన్స్టాన్స్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి