Ind vs Aus: వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో కీలక వన్డే సిరీస్.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఎవరు రానున్నారంటే?
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2023 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది. ఇప్పటికే ఫైనల్స్‌లోకి ప్రవేశించిన భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ లేదా శ్రీలంకతో తలపడనుంది. కాగా ఆసియా కప్ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకం. అయితే ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియాను ఇంకా ప్రకటించలేదు.

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2023 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది. ఇప్పటికే ఫైనల్స్‌లోకి ప్రవేశించిన భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ లేదా శ్రీలంకతో తలపడనుంది. కాగా ఆసియా కప్ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకం. అయితే ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియాను ఇంకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 22న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఇదే చివరి సిరీస్. అందుకే ఎలాంటి గందరగోళం లేకుండా సెలక్షన్ కమిటీ ఈ వారమే బలమైన జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కి భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సంజూని కొంతకాలం బ్యాకప్‌గా మాత్రమే ఉంచాలని నిర్ణయించింది. దీంతో 2023 ప్రపంచకప్, 2023 ఆసియా క్రీడలు, ప్రపంచకప్, ఆసీస్‌తో జరిగే సిరీస్‌లలో కూడా అతనికి అవకాశం లేదు. దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ KL రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతనితో పాటు జట్టులో వికెట్ కీపర్‌గా ఇషాన్ ఉన్నాడు. ఈ దురదృష్టకర కారణం వల్ల సంజుకి అవకాశం రాలేదు.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రాహులే కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడు’ అని తెలిపాడు.
కాగా, ఆసీస్‌తో జరిగే సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌కు శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ పై ఇంకా గందరగోళం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు అయ్యర్ దూరం కావడం దాదాపు ఖాయం. అయ్యర్ వెన్నునొప్పి పాతదా లేక కొత్త గాయమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో శ్రేయాస్ బాగానే కనిపించాడు. కానీ అతని పునరాగమనం కేవలం తొమ్మిది బంతుల్లోనే ముగిసింది. వెన్నుగాయంతో ఆసియా కప్ నుంచి తప్పుకున్నారు. అయ్యర్ ప్రస్తుతం కొలంబోలోని వైద్య బృందం సంరక్షణలో ఉన్నారు. అయ్యర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.




