అడిలైడ్‌లోని ఓవల్ మైదానంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. పెర్త్ టెస్టు మ్యాచ్ సందర్భంగా గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతోఅతనికి బదులుగా మరో పేసర్ స్కాట్ బోలాండ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో, ఉస్మాన్ ఖ్వాజా మరియు నాథన్ మెక్‌స్వీనీలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు, మార్నస్ లాబుస్చెయిన్ మూడో స్థానంలో, స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. అలాగే వికెట్ కీపర్‌గా అలెక్స్ కారీ కనిపించనున్నాడు. పేసర్లుగా పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ బౌలింగ్ చేయనున్నారు. అలాగే నాథన్ లియాన్‌ను స్పిన్ విభాగం బాధ్యతలను చూసుకోనున్నాడు.
ఇక భారత జట్టు విషయానికి వస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. అలాగే ప్రిన్స్ శుభ్ మన్ గిల్ కూడా బరిలోకి దిగే అవకాశముంది. దీని ప్రకారం, తొలి మ్యాచ్‌లో ఆడిన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ అడిలైడ్ టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. వీరి స్థానంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ప్లేయింగ్ స్క్వాడ్‌లో కనిపించనున్నారు. ఇక్కడ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు స్టార్టర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఆడనుండగా, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఐదు, ఆరో స్థానాల్లో బరిలోకి దిగే అవకాశముంది.
నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లకు ఆల్‌రౌండర్లుగా అవకాశం దక్కే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణాలు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండవచ్చు.
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుచెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
Mitchell Starc in Day/Night Tests is super lethal🔥 Ravichandran Ashwin and Jasprit Bumrah aren’t bad either.
Who do you think will win the Adelaide Test and who’ll be the bowler to watch out for?#AUSvsIND | #TestCricket pic.twitter.com/6TpHpHt8Y4
— Cricket.com (@weRcricket) December 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..