Video: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. మైదానం వీడిన జస్ప్రీత్ బుమ్రా.. అసలేమైందంటే?

|

Jan 04, 2025 | 10:12 AM

Jasprit Bumrah Leaves SCG: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌‌లో రోజు రోజుకు హీట్ పెరుగుతోంది. భారత బౌలర్లు బీస్ట్ మోడ్‌ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో 181 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి భారత జట్టుకు కేవలం 4 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది.

Video: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. మైదానం వీడిన జస్ప్రీత్ బుమ్రా.. అసలేమైందంటే?
Jasprit Bumrah Leaves Scg
Follow us on

Jasprit Bumrah Leaves SCG: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌‌లో రోజు రోజుకు హీట్ పెరుగుతోంది. భారత బౌలర్లు బీస్ట్ మోడ్‌ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో 181 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి భారత జట్టుకు కేవలం 4 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. టీమిండియా టాప్ వికెట్ టేకర్, ప్రస్తుత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. వైద్య సిబ్బందితో కలిసి బయటకు వెళ్లడం కనిపించింది. దీంతో భారత అభిమానులలో ఆందోళన నెలకొంది. అసలు బుమ్రాకు ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మైదానం నుంచి వెళ్లిన బుమ్రా..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో భారత జట్టులో కీలక బౌలర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న బుమ్రా తన తిరుగులేని ప్రదర్శనతోనే కాదు.. కెప్టెన్సీలోనూ అద్బుతంగా ఆకట్టుకుంటున్నాడు. అయితే, 2వ రోజు ప్రారంభంలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 32వ ఓవర్ తర్వాత బుమ్రా మైదానాన్ని వీడాడు. చాలా సేపటి తర్వాత కూడా భారత కెప్టెన్ మైదానంలో కనిపించకపోవడంతో అక్కడ ప్రశ్నలు తలెత్తాయి. బుమ్రా స్టేడియం నుంచి బయటకు రావడంతో మళ్లీ ఆందోళన మొదలైంది.

ఇవి కూడా చదవండి

మైదానం నుంచి బయటకు వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకుని ప్రాక్టీస్ కిట్‌ను ధరించాడు. కొద్దిసేపటి తర్వాత, అతను వైద్య సిబ్బందితో మైదానం విడిచిపెట్టాడు. తర్వాత అతను కారులో మైదానం నుంచి బయటకు వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. దీని వెనుక గల కారణాలపై ఉత్కంఠ నెలకొంది. స్కానింగ్‌ కోసం వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

బుమ్రా రీఎంట్రీ ఇస్తాడా?

పెర్త్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా సారథ్యంలోని టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్ నుంచి బుమ్రా తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా ఒత్తిడిలో ఉన్న ప్రతిసారీ ఈ పేసర్ జట్టును కాపాడుతున్నాడు. ఈ సిరీస్‌లో బుమ్రా ఇప్పటి వరకు అత్యధికంగా 32 వికెట్లను సాధించాడు.

ఈ క్రమంలో బుమ్రా మ్యాచ్‌ను మధ్యలోనే నిష్క్రమించడంతో, మిగిలిన మ్యాచ్‌లో అతను అందుబాటులో ఉంటాడా అనే ఆందోళన తలెత్తుతోంది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌ ఇంకా మిగిలే ఉంది. మహ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్ల సమక్షంలో బుమ్రా అందుబాటులో లేకపోవడం జట్టుకు భారీ ఎదురుదెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడానికి భారత జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. అలాగే, బుమ్రా గైర్హాజరీ చేయాల్సి వస్తే భారత జట్టుకు తీరని ఎదురుదెబ్బ కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..