IND vs AFG: అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్.. ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్
జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టు భారత్‌కు చేరుకుంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.
జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టు భారత్‌కు చేరుకుంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇంతలో, ఈ సిరీస్ నుండి టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు స్టార్ ప్లేయర్లు తప్పుకున్నారనే పెద్ద వార్త బయటకు వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో లేరని సమాచారం. ESPNcricinfo నివేదిక ప్రకారం, రుతేరాజ్ గైక్వాడ్ ప్రస్తుతం వేలి గాయంతో బాధపడుతున్నారు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించినట్లు సమాచారం. వాస్తవానికి, డిసెంబర్ 19న పోర్ట్ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో ODIలో గైక్వాడ్ వేలికి గాయమైంది. ఈ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు రుతురాజ్. అతనితో పాటు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా గాయాలు, ఇతర సమస్యల కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు భారత జట్టుకు దూరంగా ఉండనున్నారు. ESPNcricinfo నివేదిక ప్రకారం, IPL సమయానికి సూర్యకుమార్ , హార్దిక్ ఇద్దరూ ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ గాయపడగా, 2023 ప్రపంచకప్ సమయంలో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.
ఈ ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో జట్టులోని యువ ఆటగాళ్లకు టీమ్ ఇండియా అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ సిరీస్‌కు యువ ఆటగాళ్లను ఎక్కువగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇద్దరు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్ ఆడనున్నట్లు తెలుస్తోంది. సిరీస్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే, మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం (జనవరి 11) భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ తొలి మ్యాచ్ జరగనుంది. రెండో టీ20 మ్యాచ్ (జనవరి 14) ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మరోవైపు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో సిరీస్‌లోని చివరి మ్యాచ్ (జనవరి 17)లో ఇరు జట్లు తలపడనున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌కు టీమిడియా (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..