IND vs AFG: రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. ఆ స్టార్ ప్లేయర్లు దూరం
దక్షిణఫ్రికాపై చారిత్రాత్మక విజయంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది లో మొదటిగా అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20 ల సిరీస్‌లో టీమ్ ఇండియా తలపడనుంది. ఇందుకోసం ఆదివారం (జనవరి 07) బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌తో వచ్చే వారం నుంచి టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
దక్షిణఫ్రికాపై చారిత్రాత్మక విజయంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది లో మొదటిగా అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20 ల సిరీస్‌లో టీమ్ ఇండియా తలపడనుంది. ఇందుకోసం ఆదివారం (జనవరి 07) బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌తో వచ్చే వారం నుంచి టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో పాటు విరాట్ కోహ్లీ కూడా టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు నవంబర్ 2022 తర్వాత తిరిగి పొట్టి ఫార్మాట్‌లో ఆడనుండడం గమనార్హం. జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024కి ముందు టీమ్ ఇండియాకు ఇదే చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్. అటువంటి పరిస్థితిలో రోహిత్, విరాట్ తిరిగి టీ20ల్లోకి వస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. నవంబర్ 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ ఓటమి తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. హార్దిక్, రోహిత్‌లలో ఎవరికి కెప్టెన్సీ దక్కుతుందనే ప్రశ్న కూడా తలెత్తింది. వీటన్నింటికీ ఆదివారం సమాధానం దొరికింది. ఊహాగానాలన్నీ నిజమేనని రుజువు చేస్తూ సెలక్షన్ కమిటీ వెటరన్ ఆటగాళ్లిద్దరికీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం కల్పించింది. గత 14 నెలలుగా రోహిత్, విరాట్ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్‌గా లేనందున ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీంతో సెలెక్టర్లు రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
ఇషాన్, శ్రేయస్ దూరం..
అయితే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు. గతంలో ఇషాన్ దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌లో భాగమయ్యాడు. అయితే మానసికంగా అలసట కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకుని క్రికెట్‌కు కొంత విరామం ప్రకటించాడు. ఇషాన్ తిరిగి రావడానికి ఇంకా అందుబాటులో లేరా లేదా అతనిని ఎంపిక చేయకూడదని సెలక్టర్లు నిర్ణయించుకున్నారా లేదా అనే విషయాన్ని బీసీసీఐ వెల్లడించలేదు. అతనితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ని కూడా ఈ సిరీస్ నుంచి తప్పించారు. అతను దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగమయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మరియు మహ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి కల్పించారు. జనవరి 25 నుండి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు వీరు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
భారత జట్టు
🚨 NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Afghanistan announced 🔽
Rohit Sharma (C), S Gill, Y Jaiswal, Virat Kohli, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Sanju Samson (wk), Shivam Dube, W Sundar, Axar Patel, Ravi Bishnoi, Kuldeep Yadav,…
— BCCI (@BCCI) January 7, 2024
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కులదీప్ యాదవ్ ., అవేష్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్
భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్
- 11 జనవరి- 1వ టీ20, మొహాలీ
- 14 జనవరి- రెండవ T20, ఇండోర్
- జనవరి 17- 3వ టీ20, బెంగళూరు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..