IND vs AFG: అఫ్గన్‌తో టీ20 సిరీస్‌.. ఇవాళ భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి

జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత జట్టు ప్రకటనపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. మీడియా కథనాల ప్రకారం అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో టీమిండియాకు..

IND vs AFG: అఫ్గన్‌తో టీ20 సిరీస్‌.. ఇవాళ భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి
Rohit Sharma, Virat Kohli

Updated on: Jan 07, 2024 | 7:24 AM

జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత జట్టు ప్రకటనపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. మీడియా కథనాల ప్రకారం అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అలాగే విరాట్ కోహ్లీ కూడా జట్టులో భాగమవుతాడని సమాచారం. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వెస్టిండీస్‌, అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. తద్వారా టీ20 ప్రపంచకప్ పరంగా చూస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఫ్ఘనిస్థాన్ పై ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. భారత్‌తో టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ జట్టు తొలిసారిగా భారత్‌కు రానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జనవరి 11న మొహాలీ మైదానంలో జరగనుంది. దీని తర్వాత జనవరి 14న ఇండోర్‌లో జరిగే రెండో టీ20లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో చివరి టీ20 జనవరి 17న బెంగళూరులో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

జనవరి 11న భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు ఆఫ్ఘనిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. అయితే టీమ్ ఇండియాను ఇంకా ప్రకటించలేదు. టీ20 సిరీస్‌ కోసం అఫ్గానిస్థాన్‌ జట్టు తొలిసారి భారత్‌లో పర్యటించింది. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం.

ఇవి కూడా చదవండి

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ జట్టు:

బ్రహీం జద్రాన్‌ (కెప్టెన్‌), రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌)‌, ఇబ్రహీం అలిఖిల్‌ (వికెట్‌ కీపర్‌), హజ్రతుల్లా జజాయ్‌, రెహ్మత్‌ షా, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ, కరిమ్‌ జనా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, సహ్రఫుద్దీన్‌ అష్రఫ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ, ఫరీద్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ సలీమ్‌, ఖాయిస్‌ అహ్మద్‌, గుల్బాదిన్‌ నయీబ్‌, రషీద్‌ ఖాన్‌

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..