T20 World Cup 2024: మరికాసేపట్లో ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్.. సెమీస్ బెర్త్ కోసం ఎన్ని రన్స్ తో గెలవాలంటే?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 18వ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం (అక్టోబర్ 13) రాత్రి జరిగే ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం . ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత జట్టు నేరుగా సెమీస్‌లోకి ప్రవేశించగలదు. ఒకవేళ స్వల్ప తేడాతో ఓడితే మాత్రం న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితం వేచి చూడాల్సిందే.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 18వ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం (అక్టోబర్ 13) రాత్రి జరిగే ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం . ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత జట్టు నేరుగా సెమీస్‌లోకి ప్రవేశించగలదు. ఒకవేళ స్వల్ప తేడాతో ఓడితే మాత్రం న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితం వేచి చూడాల్సిందే. అయితే అంతకంటే ముందు నేటి మ్యాచ్‌లో నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియాను భారత జట్టు అధిగమిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధించడం ఖాయం. ప్రస్తుత పాయింట్ల పట్టికలో, ఆస్ట్రేలియా జట్టు 6 పాయింట్లు +2.786 నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో టీమ్ ఇండియా 4 పాయింట్లతో +0.576 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఆస్ట్రేలియాపై గెలిస్తే టీమిండియా పాయింట్లు కూడా ఆరుకు పెరుగుతాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలుపుకుంటుంది. అయితే ఇక్కడ నెట్ రన్ రేట్ లో ఆస్ట్రేలియాను అధిగమించాలంటే టీమ్ ఇండియా కనీసం 60 పరుగుల తేడాతో గెలవాలి.
సెమీస్ చేరాలంటే లెక్కలిలా..
- భారత్ మొదట బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేస్తే, ఆస్ట్రేలియా 117 పరుగులకే పరిమితం కావాలి. దీని ద్వారా నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియాను అధిగమించవచ్చు.
- ఒక వేళ టీమ్ ఇండియా 160 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 98 పరుగులకే పరిమితం కావాలి. అంటే ఇక్కడ టీమ్ ఇండియా గెలవాలంటే కనీసం 60 పరుగుల మార్జిన్ ఉండాలి.
- ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 120 పరుగులు సేకరిస్తే.. టీమ్ ఇండియా ఈ స్కోరును 10.1 ఓవర్లలో ఛేదించాలి.తద్వారా భారీ తేడాతో గెలిస్తేనే నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. అలాగే ఈ టాప్ పొజిషన్‌తో సెమీఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.
ఒకవేళ ఆస్ట్రేలియాపై టీమిండియా స్వల్ప తేడాతో విజయం సాధిస్తే మాత్రం.. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలని కోరుకోవాల్సిందే. ఒక వేళ న్యూజిలాండ్ 20 రన్స్ కంటే తక్కువ తేడాతో గెలిచినా, నెట్ రన్ రేట్ సహాయంతో టీమ్ ఇండియా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
Tanuja Kanwar, Shafali Verma, Pooja Vastrakar and Renuka Singh enjoy their time in Dubai !! 🌟
Good luck for the big game against Australia ladies !! 💪#SanjuSamson #BabarAzam #INDvBAN #HarshitRana #INDvAUS #GautamGambhir #RanjiTrophy #SuryakumarYadav pic.twitter.com/1KWYzFDDol
— Cricketism (@MidnightMusinng) October 13, 2024
ఆస్ట్రేలియా మహిళల జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, యాష్లే గార్డనర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వేర్‌హామ్, తహ్లియా మెక్‌గ్రాత్, అన్నాబెల్లె సదర్లాండ్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షట్, టైలా వ్లెమింక్, హారిస్ కింగ్ బ్రౌన్, అల్ కింగ్ బ్రౌన్, కిమ్ గార్త్.
మహిళల టీమ్ ఇండియా: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజీవన్ సజ్నా, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్, దయస్తిక భట్యా, యాస్తిక భట్యా రాధా యాదవ్, పూజా వస్త్రాకర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి