IND vs AUS: ఆస్ట్రేలియాపై ఓడితే.. భారత్ ఆశలన్నీ ఆ మ్యాచ్‌పైనే..

Women’s T20 World Cup 2024: నేడు (ఆగస్టు 13) మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం మరో రెండు జట్ల ఫలితాలపై ఎదురుచూడాల్సిందే.

IND vs AUS: ఆస్ట్రేలియాపై ఓడితే.. భారత్ ఆశలన్నీ ఆ మ్యాచ్‌పైనే..
Indw Vs Ausw
Follow us
Venkata Chari

|

Updated on: Oct 13, 2024 | 6:08 PM

Women’s T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 18వ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈరోజు (ఆగస్టు 13) జరగనున్న మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత జట్టు నేరుగా సెమీస్‌లోకి ప్రవేశించగలదు. ఒకవేళ స్వల్ప విజయం నమోదైతే న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. అయితే, అంతకంటే ముందు నేటి మ్యాచ్‌లో నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియాను భారత జట్టు అధిగమిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధించడం ఖాయం కానుంది.

భారత జట్టు ఎన్ని పరుగుల తేడాతో గెలవాలి?

ప్రస్తుత పాయింట్ల పట్టికలో, ఆస్ట్రేలియా జట్టు 6 పాయింట్లతో +2.786 నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది. రెండో స్థానంలో టీమ్ ఇండియా 4 పాయింట్లతో +0.576 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఆస్ట్రేలియాపై గెలిస్తే టీమిండియా పాయింట్లు కూడా ఆరుకు పెరుగుతాయి.

అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. అయితే ఇక్కడ నెట్ రన్ రేట్ లో ఆస్ట్రేలియాను అధిగమించాలంటే టీమ్ ఇండియా కనీసం 60 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది.

భారత్ మొదట బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేస్తే, ఆస్ట్రేలియా 117 పరుగులకే పరిమితం కావాలి. దీని ద్వారా నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియాను అధిగమించవచ్చు.

టీమ్ ఇండియా 160 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 98 పరుగులకే పరిమితం కావాలి. అంటే ఇక్కడ టీమ్ ఇండియా గెలవాలంటే కనీసం 60 పరుగుల మార్జిన్ ఉండాలి.

ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 120 పరుగులు చేస్తే.. టీమ్ ఇండియా ఈ స్కోరును 10.1 ఓవర్లలో ఛేదించాలి.

తద్వారా భారీ తేడాతో గెలిస్తేనే నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. అలాగే ఈ టాప్ పొజిషన్‌తో సెమీఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.

ఆస్ట్రేలియాపై టీమిండియా స్వల్ప విజయాన్ని నమోదు చేస్తే, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలని ఎదురుచూడాల్సి ఉంటుంది. లేదా న్యూజిలాండ్ 20 కంటే తక్కువ తేడాతో గెలిచినా, నెట్ రన్ రేట్ సహాయంతో టీమ్ ఇండియా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..